Arvind Swamy, Balakrishna: బాలయ్య సినిమా విషయంలో అరవింద స్వామి సమస్య ఇదే!

గత కొన్ని రోజులుగా బాలకృష్ణ అరవిందస్వామి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం మేకర్స్ అరవింద స్వామిని సంప్రదించగా ఆయన డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ విని షాకవ్వడం ఈ సినిమా మేకర్స్ వంతైందని తెలుస్తోంది. భారీ మొత్తంలో ఆయన అడగడంతో మరో నటుడిని ఈ సినిమాలో ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అరవింద స్వామి భాగమయ్యే అవకాశం దాదాపుగా లేనట్లేనని బోగట్టా.

టాలీవుడ్ డైరెక్టర్లు పక్క భాషల నటీనటులపై ఆసక్తి చూపిస్తుండగా వాళ్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ల గురించి షాకవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీ పాన్ ఇండియా మూవీ కాదని బోగట్టా. తెలుగులో మాత్రమే తెరకెక్కుతున్న సినిమా కోసం భారీ మొత్తంలో ఇతర భాషల ఆర్టిస్ట్ లకు రెమ్యునరేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ పెరగడంతో ఇతర భాషల ఆర్టిస్ట్ లు ప్రస్తుతం ఊహించని రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు.

ఇతర భాషల ఆర్టిస్టుల పారితోషికాలు ఎక్కువే అయినా దర్శకనిర్మాతలు తప్పనిసరి పరిస్థితులలో వాళ్లు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సినిమా హిట్టైతే ఈ రెమ్యునరేషన్లు నిర్మాతలపై పెద్దగా భారం కాకపోయినా ఫ్లాపైతే మాత్రం భారంగా మారే అవకాశం ఉంటుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి బాలయ్య 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ సైతం దాదాపుగా ఇదే స్థాయిలో ఉందని తెలుస్తోంది.

బాలయ్య, అనిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus