Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్ ‘చెప్పను’కి కారణం ఇదేనా?
- July 2, 2026 / 08:13 PM ISTByFilmy Focus Desk
మొన్నీ మధ్య జరిగిన ‘పెద్ది’ ఆఖరి దింపు కల్లెం ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ రామ్‌చరణ్ సినిమా గురించి ‘చెప్పను’ అంటూ మొండికేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీనికి ఒక్కొక్కరు ఒక్కో విషయం చెబుతున్నా.. సుకుమార్ మౌనం వెనుక పెద్ద కారణమే ఉంది అంటున్నారు. అయితే ఎక్కడా ఇప్పటివరకు ఏ విషయమూ తేలేదు. ఈ సినిమాను ఓ కాన్సెప్ట్ వీడియోతో అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నారని.. అదే పనిలో ఉన్నారని చెబుతున్నారు.
Arya
అయితే, ఈ విషయంలో మరో కోణం బయటకు వచ్చింది. అదే సుకుమార్ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట. అదేంటి ఈ సినిమా పక్కన పెట్టేసుకున్నారు అని అనుకుంటున్నారా. అవును ఆయన ఇప్పుడు వేరే సినిమా పనిలో ఉన్నారట. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆర్య’ సినిమా గురించి చెప్పారు. ఈ క్రమంలో సుకుమార్ ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. తద్వారా రామ్‌చరణ్ సినిమా కాస్త హోల్డ్‌లో కానీ, పాజ్‌లో కానీ పడిందని అర్థమవుతోంది.
‘ఆర్య 2’ సినిమా ఇబ్బందికర ఫలితం అందుకున్నా.. ‘ఆర్య 3’ సినిమా తీసుకొస్తున్నారా అనే డౌట్ పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న ‘ఆర్య’ నార్మల్ సినిమా కాదు.. యానిమేషన్ సినిమా. అవును తెలుగు సినిమాలో పెక్యూలియర్ పాత్రగా పేరు తెచ్చుకున్న ఆర్యను యానిమేషన్‌గా తీసుకురాబోతున్నారట. ఆ పాత్ర ఏం చేస్తుంది, ఏం చూపిస్తారు అనే తెలియదు కానీ.. ఈ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారనేది క్లారిటీ. ఈ పనుల విషయం చెప్పాల్సి వస్తుందనే సుకుమార్ ఆ రోజు తన కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పలేదేమో అనే అనుమానం కలుగుతోంది.
మరోవైపు సుకుమార్ చెప్పిన కథ పాయింట్ విషయంలో రామ్‌చరణ్ ఇంకా సంతృప్తి వ్యక్తం చేయలేదు అని అంటున్నారు. ఇప్పటికే రెండు వెర్షన్లు రాశారని టాక్. మరో రెండు నెలల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఈ లోపు చరణ్ ‘పెద్ది’ మూడ్ నుండి బయటకు వస్తాడట.















