Ashok Selvan: హీరోయిన్ కీర్తి పాండియ‌న్ ను పెళ్లి చేసుకున్న హీరో అశోక్ సెల్వన్

తమిళ కథానాయకుడు అశోక్ సెల్వన్ గుర్తు ఉన్నారా? ప్రముఖ తెలుగు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నిన్నిలా నిన్నిలా’లో హీరో. ఆ సినిమాలో ఆయన సరసన నిత్యా మీనన్, రీతూ వర్మ నటించారు. ఇంకా బాగా చెప్పాలంటే… విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఉందిగా అందులో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ పెళ్ళికి ముందు వేరే అబ్బాయితో వెళ్ళిపోతుంది కదా! ఆ అబ్బాయి ఈయనే ఓ తెలుగు సినిమాలో హీరోగా నటించడం, మరో తెలుగు సినిమాలో అతిథి పాత్ర చేయడంతో పాటు అనువాద సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అశోక్ సెల్వన్ దగ్గర అయ్యారు.

తమిళ కథానాయకుడు అశోక్ సెల్వన్ ఈ రోజు సెప్టెంబ‌ర్ 13న (బుధ‌వారం) ఉదయం ఏడు అడుగులు వేశారు. కీర్తీ పాండియన్ మెడలో ఆయన మూడు ముడులు వేసి ఇప్పుడు ఆయన ఓ ఇంటివాడు అయ్యారు. తమిళనాడులోని తిరుణవేలిలో జరిగిన ఈ వివాహానికి నూతన వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు.

ఇంతకీ, అశోక్ సెల్వన్ (Ashok Selvan) పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? తమిళ టీవీ వీక్షకులకు, వెండితెర ప్రేక్షకులకు తెలిసిన నటి రమ్యా పాండియన్ కజిన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే… కీర్తీ పాండియన్ తమిళ హీరోయిన్. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుణ్ పాండియన్ కుమార్తె.

అశోక్ సెల్వన్, కీర్తీ పాండియన్ కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. తమిళ సినిమా ‘బ్లూ స్టార్’లో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణలో మొదలైన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారిందని చెన్నై సినిమా వర్గాల ఖబర్. అయితే, తమ ప్రేమ విషయాన్ని వీళ్ళిద్దరూ తొలుత రహస్యంగా ఉంచారు. కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. రమ్యా పాండియన్ చేసిన ట్వీట్ కారణంగా వాళ్ళ విషయం బయటకు వచ్చింది. ఇవాళ పెళ్లి ఫోటోలను అశోక్‌ సెల్వన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus