Ashu Reddy: అషు రెడ్డి కి కొత్త కారు… వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘బిగ్ బాస్’ ఫేమ్ అషు రెడ్డి ఓ కారుకి ఓనర్ అయ్యింది.ఈ కారు ఆమెకు బహుమతిగా లభించింది.ఆమెకు కారు కొనిచ్చింది మరెవరో కాదు ఆమె తండ్రి. ఈరోజు అనగా సెప్టెంబర్ 15న ఆమె పుట్టినరోజు కావడంతో అషు రెడ్డికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు ఆమె తండ్రి.ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో తెలియజేసింది. ’ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ప్రైజ్ బహుమతి ఇదే.. ” అంటూ ఆమె పేర్కొన్నారు.

అలాగే కారుతోనూ అలాగే తన తండ్రితోనూ దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి.. అంతకు ముందు నితిన్ నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కారణంగా డిప్రెషన్ కు గురవ్వడం.. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల బరువు పెరిగినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

‘బిగ్ బాస్ 3’ లో ఈమె ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో కొన్నాళ్ల పాటు ఈమె హౌస్ లో కొనసాగింది.అటు తర్వాత ఈమె బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కూడా పాల్గొంది. ప్రస్తుతం బుల్లితెర షోలతోనూ అలాగే తన యూట్యూబ్ ఛానల్ లో పర్సనల్ వీడియోలు చేస్తూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. ఇక ఆమె కొత్త కారు ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus