బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే హైడ్రామా అనేది మొదలైంది. మూడోవారం హౌస్ మేట్స్ అసలు గేమ్ ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సీనియర్స్ ఎమోషన్స్ ని పండించేస్తున్నారు. నామినేషన్స్ లో బిందుకి, ఇంకా తేజస్వికి టఫ్ ఫైట్ అయ్యింది. అంతేకాదు, బిందు అఖిల్ పైన అలుగుతావ్ అనే ముద్ర కూడా వేసింది. అందరూ హౌస్ లో అదే చెప్తుంటారు. అని స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో అఖిల్ మూడ్ ఆఫ్ అయ్యాడు.
ఇక అషూరెడ్డితో సరదాగా మాట్లాడిన మాటలు కూడా పట్టించుకుని అషూకి క్లాస్ పీకాడు. నువ్వు ఓవర్ గా థింక్ చేస్తావ్ అంటూ అషూరెడ్డి చెప్పేసరికి దాన్ని తీసుకోలేకపోయాడు. మళ్లీ ఇదో ముద్రలా అయిపోతుందని ముందుగానే ఖండించాడు. దీంతో అషూరెడ్డి బాధపడింది. అషూ బాధపడుతున్న సమయంలో అరియానా వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అరియానా అషూని కాసేపు ఓదార్చింది. ఇద్దరూ ఫస్ట్ వీక్ నుంచీ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
అరియానా అయితే గేమ్ ని రెండువైపులా ఆడుతోంది. ఒకవైపు సీనియర్స్ తో మసలుకుంటూనే, జూనియర్స్ ని కూడా కలుపుకుంటూ వెళ్తోంది. అషూరెడ్డి కూడా అఖిల్ ఇంకా అరియానాతో కలిసే ఉంటోంది. ఇద్దరూ కూడా ఎలాగైనా సరే టాప్ 5కి వెళ్లాలని కన్నేశారు. ప్రస్తుతం ఈవారం అషూరెడ్డి నామినేషన్స్ లో లేదు కాబట్టి, అరియానాకి టాస్క్ ఆడే అవకాశం కల్పిస్తుంది. ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా అరియానా మూడో వారం నుంచే లెక్కలు వేస్తోంది. లాజిక్స్ వర్కౌట్ చేస్తూ నామినేషన్స్ చేస్తోంది.
అక్కడ మాత్రం చాలా క్లియర్ గా ఉంటోంది. అంతేకాదు, జూనియర్స్ కి కూడా టాస్క్ లలో హెల్ప్ చేస్తూ వాళ్లకి బాగా క్లోజ్ అయ్యింది అరియానా. దీంతో ఎటుసైడ్ ఎక్కువ ఛాన్స్ ఉంటే అటుసైడ్ మాట్లాడి మార్కులు కొట్టేసేలాగానే కనిపిస్తోంది. మరోవైపు అషూరెడ్డి కూడా ఎక్కువ వారాలు ఉండేందుకు, అందరినీ కలుపుకుంటూ పోతోంది. అందుకే ఈవారం అషూరెడ్డిని ఒక్కరు కూడా నామినేట్ చేయలేకపోయారు. తన మిస్టేక్స్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్కుంటూ సేఫ్ జోన్ లో ఉంటోంది.
ఇక అఖిల్ విషయంలో కొద్దిగా ఎమోషనల్ అయినా కూడా ఆ తర్వాత అఖిల్ వచ్చి మాట్లాడేసరికి మళ్లీ నార్మల్ అయిపోయింది. చిన్న చిన్న విషయాలని సాగదీయకుండా అక్కడికక్కడే క్లారిఫికేషన్స్ ఇచ్చేస్తోంది అషూరెడ్డి. అరియానాతో ఫ్రెండ్షిప్, యాంకర్ శివని టీజ్ చేయడం, చైతూని కలుపుకోవడం ఇలా జూనియర్స్ తో సైతం అషూ బిహేవియర్ బాగుంది. అరియానా ఇంకా అషూ వీరిద్దరి గేమ్ ఎక్కడి వరకూ వెళ్తుందో వెయిట్ చేసి చూడాలి.