బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్స్ లో చాలా ఆసక్తికరంగా జరిగాయి. బజర్ మోగగానే హారన్ చేజిక్కించుకున్న హౌస్ మేట్స్ డ్రైవర్ గా మారి ఇద్దరిని నామినేట్ చేస్తారు. వారిలో హౌస్ మేట్స్ అందరూ ఓటింగ్ ద్వారా ఒకరిని సేఫ్ చేయాలి. ఇక్కడే నాలుగోసారి బజర్ మోగినపుడు మహేష్ విట్టా హారన్ ని పట్టుకున్నాడు. ఇక్కడే అరియానాకి ఇంకా అషూరెడ్డికి ఇద్దరికీ ఫిట్టింగ్ పెట్టాడు. వీరిద్దరూ హౌస్ లో క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసి ఎవరు సాక్రిఫైజ్ చేస్తారో చూద్దాం అన్నట్లుగా ప్లాన్ చేశాడు.
ఇక్కడే మహేష్ విట్టా అరియానాని మరోసారి ట్రిగ్గర్ చేశాడు. సరయు విషయంలో బాడీ షేమింగ్ పాయింట్ ని తీస్కుని వచ్చాడు. దీంతో అరియానా ఈ ఇష్యూని క్లియర్ చేసేద్దాం అని చాలా క్లియర్ గా చెప్పింది. నేను సరయు విషయంలో బాడీ షేమింగ్ చేయలేదని, అస్సలు నా క్యారెక్టర్ అది కాదని చెప్పింది. అంతేకాదు, ఈవిషయంలో నా గురించి స్టాండ్ తీస్కున్న అషూరెడ్డిని సేఫ్ చేయమని అరియానా రిక్వస్ట్ చేసింది. అంతేకాదు, అసలు సరయు విషయంలో ఏం జరిగింది అనేది అరియానా తన గోడుని చెప్పుకుంది.
సరయు హర్ట్ అయ్యిందని, నేను సారీ కూడా చెప్పానని, అసలు ఫ్రెండ్షిప్ లో తను లైట్ తీస్కుని ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదని చెప్పింది అరియానా. అంతేకాదు, ఈసారి హారన్ ని దక్కించుకుని లారీ డ్రైవర్ గా వచ్చిన అరియానా సరయుపై ప్రతీకారం తీర్చుకుంది. బాడీ షేమింగ్ విషయంలోనే క్లియర్ చేసుకుందాం అని సరయుని నామినేట్ చేసింది. ఇక్కడే సెకండ్ పర్సన్ గా హమీదాని ఎంచుకుంది అరియానా. రేషన్ మేనేజర్ గా తను చేసిన మిస్టేక్ గురించి అరియానా ఎక్స్ ప్లనేషన్ చేసింది.
ఇక్కడే ఇద్దరికీ బాగా ఆర్గ్యూమెంట్ జరిగింది. హమీదా మాటకి మాట చెప్పింది. తను తప్పులేదని నిరూపించుకుంది. అలాగే, సరయుని ఎందుకు నామినేట్ చేయాలో కూడా హమీదా చాలా క్లియర్ గా చెప్పింది. అందుకే, హమీదా సేఫ్ జోన్ లోకి వచ్చింది. సరయు నామినేట్ అయ్యింది. తన పాయింట్ ని బలంగా నమ్మి మరీ అరియానా వాదించింది. ఎలాగైనా సరే హారన్ పట్టుకోవాలి అని అనుకుంది. దీంతో ఈవారం నామినేషన్స్ లో బిందు, మిత్రా, అనిల్, అరియానా, అజయ్, శివ, ఇంకా సరయులు ఉన్నారు.