బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అందరూ తనని నామినేట్ చేశారని తీస్కోలేకపోయింది అశ్విని. అందుకే, నయనీ పావనీ గురించి ప్రశాంత్ తో మాటలు కలిపింది. తను అందర్నీ మ్యానుప్లేట్ చేస్తోందని అందుకే నామినేట్ చేయట్లేదని చెప్పింది. అంతేకాదు, ఇక్కడ అందరూ పాములే అని, ఎప్పుడు ఎలా బుసలు కొడతారో తెలీదని చెప్పింది. అందుకే, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది చాక్లెట్ రాణీ. ఇక నామినేషన్స్ తర్వాత ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.
ఆడగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు అంటూ కొత్తగా వచ్చిన వాళ్లకి , ఆల్రెడీ హౌస్ మేట్స్ అయిన వాళ్లకి పోటీ పెట్టాడు. గ్రుప్ నుంచీ ఇద్దరు ఒక్కో ఛాలెంజ్ ఆడేందుకు రావాలని, ఈ నిర్ణయం గ్రూప్ మొత్తం కలిసి ఏకాభిప్రాయంతో చేయాలని చెప్పాడు. దీంతో ఫస్ట్ టైర్స్ టాస్క్ నడిచింది. దీనికి స్ట్రెంత్ టాస్క్ అని పేరు పెట్టాడు బిగ్బాస్. స్మిమ్మింగ్ లో పూల్ లో నెంబర్ ని తీసుకుని తన పార్టనర్ కి ఇస్తే, తను టైర్ తీస్కుని వచ్చి పూల్ లో ఉన్న బడ్డీకి ఇస్తాడు. అప్పుడు పూల్ లో ఉన్న పోల్ లో టైర్ వేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఆటగాళ్ల టీమ్ నుంచీ సందీప్ యావర్ వస్తే, పోటుగాళ్ల టీమ్ నుంచీ గౌతమ్ – అర్జున్ వచ్చి టాస్క్ ఆడారు. కొద్ది తేడాలో గౌతమ్, అర్జున్ విజయం సాధించారు. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పెడతాను అని ఎవరు జీనియస్ అవుతారో చూద్దాం అని బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ ఛాలెంజ్ లో కూడా పోటుగాళ్ల టీమ్ నుంచీ గౌతమ్ వచ్చాడు. ఆటగాళ్ల టీమ్ నుంచీ అమర్ వచ్చాడు. ఇక్కడే బిగ్ బాస్ పంచ్ లు పేలాయి. అమర్ నాలెజ్డ్ కి పెద్ద బిస్కెట్ రాజా అయిపోయాడు. ముఖ్యంగా కేక్ జోక్ బాగా పేలింది.
తన ఐక్యూ చూసి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) షాక్ అయిపోయాడు. అందుకే, జాలి వేసి ప్లేయర్ ని మార్చుకునే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ మంచిగా ఆన్సర్స్ చెప్పాడు. కానీ ఒక్క పాయింట్ తేడాతో పోటుగాళ్ల టీమ్ గెలిచింది. బిగ్ బాస్ ఇచ్చిన రెండు టాస్క్ లలో కూడా పోటుగాళ్ల టీమ్ మేట్స్ గెలిచారు. దీంతో హౌస్ ని తమ చేతుల్లోకి తీస్కోవడానికి అతి కొద్దిదూరంలో ఉన్నారు పోటుగాళ్లు. మరి ఈ పోటుగాళ్లని ఆడగాళ్ల టీమ్ మెంబర్స్ ఎలా ఎదిరిస్తారో చూడాలి.