స్టార్ హీరో ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తోన్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. దీన్ని పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ ఆగిందని..
దానికి కారణం అందులో హీరోయిన్ గా నటిస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ రావడానికి కారణమేంటంటే.. షూటింగ్ సమయంలో దీపికా పదుకోన్ కు కాస్త ఇబ్బందిగా అనిపించడంతో ఆమె వెంటనే కామినేని హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకుంది. దీంతో ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ ఆగిందని రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత అశ్వనీదత్ స్పందించారు.
‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ ఆగిందంటూ వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదని.. అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరుగుతుందని అన్నారు. జూన్ 20వరకు ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందట. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తరువాత నిర్విరామంగా జరిగే చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు.
దాదాపు పదిరోజుల పాటు ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనున్నారు. ఈ సినిమాతో పాటు మరోపక్క ‘సలార్’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.