Ashwini Dutt, Dil Raju: డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయకూడదని ఎలా చెప్తారు..?

  • November 22, 2022 / 05:17 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటితో పాటు తాను నిర్మిస్తోన్న తమిళ సినిమా ‘వరిసు’ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దిల్ రాజు. ఈ సినిమా కోసం ఎక్కువ సంఖ్యలో థియేటర్లు బుక్ చేస్తుండడంపై కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయమై నిర్మాతల మండలి ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది.

పండగల సమయంలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉంటుందని గతంలో దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ను నొక్కిచెబుతూ.. ఆయన్ను ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగింది. ఈ వివాదం నిర్మాతల మండలి ఇచ్చిన స్టేట్మెంట్ పై అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర రీతిలో స్పందించారు. నిర్మాతల మండలి స్టేట్మెంట్ ను ఆయన ఖండించారు. దిల్ రాజుకి మద్దతుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నిర్మాతల మండలి ఇచ్చిన స్టేట్మెంట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు.

వారి ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. మన సినిమాలు మన దగ్గర ఎలా ఆడుతున్నా సరే.. చాలా వరకు డబ్బింగ్ మార్కెట్, ఓటీటీల వల్లే గట్టెక్కుతున్నాయని చెప్పారు. తమిళంలో తెలుగు సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని ఎలా చెబుతారని..? ప్రశ్నించారు. ఒక తెలుగు నిర్మాత, ఒక తెలుగు దర్శకుడు కలిసి తీసిన సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసుకుంటే తప్పేముందని అడిగారు.

ఇదే సంక్రాంతికి మరో నిర్మాత తమ ప్రొడక్షన్ లో తెరకెక్కిన రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసుకోవచ్చా..? థియేటర్ల సమస్య ఎదురవుతుందంటే ఆ నిర్మాత తన సినిమాల్లో ఒకదాన్ని ఆపుకోవచ్చు కదా అని అశ్వనీదత్ అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు రెండు కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus