బిగ్ బాస్ హౌస్ లో బాల్స్ టాస్క్ నడుస్తోంది. కానీ మాటలు కూడా అంతకంటే బాగా పరిగెడుతున్నాయ్. ఎవరికి వారే వారి టంగ్ పవర్ ని చూపిస్తున్నారు. అమర్ కి రతికకి పెద్ద యుద్ధమే జరిగింది. అలాగే, తన టీమ్ మెంబర్స్ పట్ల అశ్విని అసహనాన్ని ప్రదర్శించింది. అసలు ఏం జరిగిందంటే., బిగ్ బాస్ హౌస్ లో బాల్స్ టాస్క్ లో బాల్స్ ని క్యాచ్ చేసేటపుడు స్టోర్ రూమ్ బెల్ మోగింది. దీంతో గౌతమ్ అమర్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి సంచీలని తెచ్చుకున్నారు. ఇక్కడే అమర్ రెండు టీమ్స్ సంచీలని తీస్కునే ప్రయత్నం చేశాడు.
కానీ గౌతమ్ అమర్ ని బంధించి మరీ వాటిని లాక్కున్నాడు. దీంతో అమర్ వాటిని కిందపారేశాడు. సంచీల కౌంటింగ్ చేసిన రతిక ఒక సంచీ తగ్గిందని కంప్లైట్ చేసింది. గార్డెన్ ఏరియాలో అందరూ గ్రూప్ గా టాస్క్ కోసం చూస్తున్నప్పుడు శివాజీ మావాళ్లు వెళ్లలేదు అన్నాడు. కానీ రతిక మీ వాడు వెళ్లాడు అమర్ అని చెప్పింది. దీంతో గౌతమ్ కిందపారేశాడు అంటే రతిక ఏయ్.. ఎందుకు పారేశావ్ అని గద్దించి అడిగింది. దీంతో కోపం వచ్చిన అమర్ నా ఇష్టం నీకేంటి నొప్పి అన్నాడు. దీంతో ఇద్దరి మద్యలో మాటా మాటా పెరిగింది.
ఇది నా గేమ్ స్ట్రాటజీ వెళ్లు అన్నాడు అమర్. వెధవ పనులు చేయడం దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టడం అనేసరికి అమర్ రెచ్చిపోయాడు. నా గురించి కాదు నీగురించి చూస్కో ముందు ఊస్తారు బయట అంటూ రతికని రెచ్చగొట్టాడు. ఈ మాటకి రతిక రెచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అంటూ గట్టిగా అరిచి గోల చేసింది. దీంతో ఇద్దరూ కాసేపు మాటలతోనే కొట్టుకునేంత వరకూ వెళ్లారు. ఫైనల్ గా శాంతించారు. ఆ తర్వాత రతిక అమర్ అన్నమాటలని యావర్ కి, శివాజీకి చెప్పి బాధపడింది.
ఇంకోవైపు ప్రియాంకకి ఇంకా అశ్వినికి కోల్డ్ వార్ నడించింది.
ఒకే టీమ్ లో ఉన్నా కూడా ఇద్దరికీ అస్సలు పడలేదు. అంతేకాదు, అశ్వినిని ఒక్క టాస్క్ కూడా ఆడించలేకపోయేసరికి చాలా బాధపడింది. అసలు వీళ్లకి ఒకరి గురించి ఏం తెలుసు. ఎలా అంచనా వేస్తారు. వాళ్ల బలం ఏంటో తెలియదు కదా అంటూ భోలేకి తన బాధని చెప్పుకుంది. అంతేకాదు, ఇక్కడే నోరుజారింది. వీళ్లు పెద్ద ఐఎయస్, ఐపియస్ ఆఫీసర్స్ లా ఫీల్ అవుతున్నారు. మనం ఏమో వేలిముద్రగాళ్లలా, ఎల్కేజీ చదివేవాళ్లలా కనిపిస్తున్నామ్ అంటూ నిప్పులు చెరిగింది. అంతేకాదు, అస్సలు ఈనాకొడుకు టెన్త్ క్లాస్ పాసయ్యారో , లేదో నాకు డౌటే అంటూ గొణుక్కుంది.
నాకు మంచి మాటలు వస్తాయ్ ఫ్రస్టేషన్ లో అంటూ ఇంకా గలీజ్ గా కూడా తిడతానంటూ భోలేకి చెప్పింది. దీంతో భోలే ఆమె ఫ్రస్టేషన్ కి బ్రేకులు వేశాడు. ఇక పైనల్ గా టాస్క్ లో ఆరెంజ్ టీమ్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ షిప్ ని కౌవసం చేస్కుంది. వీళ్లలో పైనల్ గా శోభాశెట్టి ఇంటి కెప్టెన్ అయినట్లుగా సమాచారం. 9వ వారం మొత్తానికి ఇంటి కెప్టెన్ అయ్యింది శోబాశెట్టి. మరి ఈవారం (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఆమెకి ఇమ్యూనిటీ ఇచ్చాడో లేదో తెలియాలి.