Vishal: అనుమతి లేకుండా టైటిల్ వాడుతున్నాడు.. హీరోపై ఆరోపణలు!

కోలీవుడ్ హీరో విశాల్ పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత పదిహేనేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న విజయ్ ఆనంద్.. విశాల్ హీరోగా నటించిన సినిమాలకు కూడా సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇటీవల విశాల్ నటించిన ‘చక్ర’ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆనంద్ తను రాసుకున్న ‘కామన్ మ్యాన్’ కథ గురించి విశాల్ కి చెప్పారట.

అయితే ఇప్పుడు విశాల్ తన కొత్త సినిమాకి ‘కామన్ మ్యాన్’ అనే టైటిల్ ను అక్రమంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తన అనుమతి లేకుండా టైటిల్ ను దొంగిలిస్తున్నారని అన్నారు. ఇటీవల విశాల్ కొత్త సినిమా అనౌన్స్ చేసి ట్యాగ్ లైన్ గా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అని జోడించాడు. ఈ విషయానికి సంబంధించి విశాల్ వర్గాన్ని నిలదీయగా.. వారు తనను బెదిరిస్తున్నారని విజయ్ ఆనంద్ ఆరోపించారు.

ఈ విషయంలో విజయ్ ఆనంద్.. శాసన సభ్యులు ఉదయనిధి స్టాలిన్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ గొడవ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కాకుండా విశాల్ ‘ఎనిమీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఆర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. అనే ‘డిటెక్టివ్’ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus