వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగో చూస్తే.. అందులో కృష్ణుడి అవతారంలో నందమూరి తారకరామారావు కనిపిస్తారు. ఎందుకలా పెట్టారు, దాని వెనుక ఉన్న కారణమేంటి అనే విషయాలను నిర్మాత అశ్వనీదత్ చాలాసార్లు చెప్పారు. తాజాగా మరోసారి ఆ విషయాలను, ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, తన మీద ఆయన చూపించిన ప్రభావాన్ని తెలిపారు అశ్వనీదత్. మీతో సినిమా చేయాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీకి లోకి వచ్చాను అని ఎన్టీఆర్‌కి చెప్పి మరీ.. సినిమా చేసిన నిర్మాత అశ్వనీదత్.
ఎన్టీఆర్ సినిమా కోసం ఓ పాత్రకిగాను వాణిశ్రీని అనుకున్నారట అశ్వనీదత్. అయితే ఆమె రూ. 2లక్షలు పారితోషికం అడిగారట. అప్పటికే ఎన్టీఆర్ ఆ సినిమా కోసం రూ. 2లక్షలు పారితోషికం ఫిక్స్ అయ్యారట. దాంతో హీరోయిన్‌కే రెండు లక్షల రూపాయలు అంటే హీరోకు ఇంకా ఎక్కువే ఇవ్వాలి కదా.. అని అశ్వనీదత్ అదనంగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారట. దానికి ఎన్టీఆర్ ప్రతిగా.. మనం అన్నది రూ. 2 లక్షలే కదా.
అంటూ అదనంగా ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేశారట. అంతటి గొప్ప వ్యక్తి ఆయన అంటూ చెప్పుకొచ్చారు అశ్వనీదత్. అలాగే ‘గౌరీ శంకరుల కథ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాన్ని కూడా అశ్వనీదత్ పంచుకున్నారు. ఆ సినిమాలో పాము సన్నివేశం ఒకటి ఉంటుందట. దాని కోసం ఓ పాము తీసుకొచ్చారట. సన్నివేశం ప్రకారం ఆ పాము ఎన్టీఆర్ దగ్గరకు రావాలట. నాదస్వరం ఊదే ముందుకు పామును పంపే ప్రయత్నం చేస్తుంటే.. ఎన్టీఆర్ వద్దన్నారట.
‘వారే వస్తారు వదిలేయండి’ అని ఎన్టీఆర్ అన్నారట. అయినా చిత్రబృందం వినకుండా ఏదో ప్రయత్నం చేశారట. ఇంతలో పాము అలా సర్ సర్ ముందు ముందుకొచ్చి ఎన్టీఆర్ మీదకు పాకేసింది అని చెప్పారు అశ్వనీదత్. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో అభిమానిగా కొనసాగాను, పార్టీ కోసం పని చేశాను తప్ప.. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని, ఆ ఆలోచన లేదని అశ్వనీదత్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?