సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అతడు’ చిత్రాన్ని 4K లో రీ- రిలీజ్ చేశారు. ఆగస్టు 9న రీ రిలీజ్ అయిన ‘అతడు’ చిత్రాన్ని చూడటానికి మహేష్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా ఎగబడ్డారు. థియేటర్లలో రీ- క్రియేషన్ వీడియోలతో కొందరు అభిమానులు చేసిన రచ్చ సోషల్ మీడియాలో చూశాం. అయితే 1500 సార్లు టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమా కథా… మళ్ళీ దీనిని చూడటానికి జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారు? అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
వారి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ.. మొదటి రోజు అద్భుతంగా కలెక్ట్ చేసిన ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసి మంచి వసూళ్లు సాధించింది.ఒకసారి ‘అతడు'(4K) 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 2.08 cr |
సీడెడ్ | 0.36 cr |
ఉత్తరాంధ్ర | 0.40 cr |
ఈస్ట్ | 0.28 cr |
వెస్ట్ | 0.24 cr |
గుంటూరు | 0.35 cr |
కృష్ణా | 0.38 cr |
నెల్లూరు | 0.12 cr |
ఏపీ+తెలంగాణ | 4.21 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.40 cr |
ఓవర్సీస్ | 1.28 cr |
వరల్డ్ టోటల్ | 5.89 (గ్రాస్) |
‘అతడు'(4K) రీ రిలీజ్లో కూడా భారీ వసూళ్లు సాధించింది.’కింగ్డమ్’ వంటి సినిమాలకి థియేటర్లు ఎక్కువగా హోల్డ్ చేయడం వల్ల ‘ఖలేజా’ రీ రిలీజ్ కి దొరికినన్ని స్క్రీన్స్ ‘అతడు’ రీ రిలీజ్ కు దొరకలేదు.మరోపక్క వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా రికార్డులైతే కొట్టలేదు. కానీ.. మంచి వసూళ్లు అయితే వచ్చాయి. 2వ రోజు ఆదివారం సెలవు కలిసి రావడంతో బాగా హోల్డ్ చేసింది అని చెప్పాలి.