Atlee, Shah Rukh Khan: బాలీవుడ్‌ క్రేజీ కాంబో అప్‌డేట్‌!

బాలీవుడ్ – కోలీవుడ్‌ కాంబినేషన్‌ అంటూ షారుఖ్‌ ఖాన్‌ – అట్లీ కలయికలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై రీసెంట్‌గా ఎలాంటి సమాచారం లేదు. సినిమా అయితే ఉంటుంది అని అంటున్నారు కానీ… ఎప్పుడు మొదలవుతుంది, కథేంటి లాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా కూడా చర్చలతో ఆగిపోయిందా అని అనుకున్నారంతా. కానీ సినిమా ఉందట, అంతేకాదు మొదలైందట.

పాన్ ఇండియన్ సినిమాగా షారుఖ్‌ – అట్లీ సినిమా రూపొందుతోందని చాలా రోజుల క్రితమే తెలిసింది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తాజా సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే… ఈ సినిమా ఇటీవల పుణెలో మొదలైందట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పూర్తయిపోయాయని టాక్‌. సినిమా కోసం అనిరుధ్‌ అదిరిపోయే సంగీతం ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమా కథ విషయంలోనూ కొంత సమాచారం తెలుస్తోంది.

పోలీసు నేపథ్యంలోనే సినిమా రూపొందుతోందట. ఇలాంటి కథలు తీయడంలో అట్లీ బాగానే చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా సినిమా కథను సిద్ధం చేసుకున్నాడట అట్లీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను తీసుకున్నారట. ఆమెతోపాటు సన్యా మల్హోత్రా కూడా ఉంటుందట. సినిమాపై అఫీషియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus