Attasudake Song: మాస్ రాజా పార్టీ సాంగ్ అదిరింది!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాదిని క్రాక్ సినిమాతో చాలా పవర్ ఫుల్ గా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అదే తరహాలో సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని ఖిలాడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అసలైతే ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన 2022లో కి షిఫ్ట్ అవ్వక తప్పలేదు. ఇక ఈ సినిమాతో కూడా రవితేజ మరో బాక్సాఫీస్ హిట్ అందుకునేలా ఉన్నట్లు అర్థమవుతోంది.

సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నట్లు మరో పాటతో క్లారిటీ ఇచ్చేశారు.ఇలాంటి సినిమాకు సంబంధించిన స్టైలిష్ పార్టీ సాంగ్ ను నేడు విడుదల చేశారు. అట్ట సూడకే అంటూ దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. సమీరా భరద్వాజ్ కూడా దేవితో పాటు ఈ పాటలో గాత్రాన్ని షేర్ చేసుకున్నారు. ఖిలాడి సినిమాలో ఈ పాట హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

ఒకవైపు రొమాన్స్, మరోవైపు హీరో ఎలివేషన్స్ అలాగే హీరోయిన్ అందాలను కూడా పాటలో రచయిత శ్రీమణి అందంగా పొందుపరిచాడు. అలాగే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా సింపుల్ స్టెప్పులతో పాటకు మరొక అందం తెచ్చినట్లు అర్థమవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏ స్టూడియోస్ పై సత్యనారాయణ కోనేరు రమేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి మరొక పాట అయితే యూట్యూబ్ లో ట్రెండ్ లిస్టులో చేరిపోయింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!


83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus