Akhil5: అఖిల్- సురేందర్ రెడ్డిల కాంబో .. అక్కినేని అభిమానుల గాలి తీసేసిందట..!

అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ … ఇప్పటికే 3 చిత్రాలు చేసాడు. కానీ ఇంకా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయాడు. డ్యాన్స్ లు,ఫైట్లు, స్క్రీన్ అప్పీరెన్స్ విషయంలో అఖిల్ కు పేరు పెట్టనవసరం లేదు. కానీ నటన పరంగా అఖిల్ ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. అయితే అఖిల్ ను కంప్లీట్ మాస్ హీరోగా ప్రెజెంట్ చెయ్యాలన్నది.. నాగార్జున అలాగే అతని అభిమానుల కోరిక. అది మాత్రం తీరడం లేదు. అఖిల్ మొదటి రెండు చిత్రాలకు ఉన్న బజ్.. మూడో చిత్రానికి ఏర్పడలేదు.

ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో అయితే అఖిల్ కు ఓ హిట్టు పడితే చాలు అన్న స్టేజికు అభిమానులు వచ్చేసారు. అయితే ఎప్పుడైతే అఖిల్ తన 5వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేస్తున్నాడు అనే ప్రకటన వచ్చిందో.. అప్పుడు మళ్ళీ అక్కినేని అభిమానులకు కొత్త ఆశలు చిగురించాయి. కచ్చితంగా అఖిల్ కు ఓ మాస్ హిట్ పడుతుంది అని వారు ఆశిస్తున్నారు. మాస్ సినిమాలు తియ్యడంలో సురేందర్ రెడ్డి దిట్ట. అంతేకాదు రూ.10కోట్ల రవితేజ మార్కెట్ ను రూ.25కోట్లకు.. అలాగే రూ.35కోట్ల అల్లు అర్జున్ మార్కెట్ ను రూ.59కోట్లకు పెంచిన ఘనత అతనిది..!

అందుకే అక్కినేని అభిమానులు.. ‘కిక్’ ‘రేసుగుర్రం’ స్టైల్ లో అఖిల్ కు సూరి ఓ మంచి హిట్ ఇస్తాడని ఆశిస్తున్నారు. కానీ అఖిల్- సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చే మూవీ ఓ థ్రిల్లర్ అని తెలిసేసరికి వీళ్ళ గాలి తీసేసినట్టు అయ్యింది. పైగా ఫస్ట్ లుక్ కూడా ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్ కు నచ్చలేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus