ఒక్కోసారి కంటెంట్ బాగున్నా, సరైన ప్రమోషన్స్ లేక సినిమాలు ఫెయిల్ అవ్వడాన్ని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ.. కంటెంట్ బాగుంది, ప్రమోషన్స్ భారీగా చేసి కూడా విఫలమైన చిత్రంగా “లవ్ రెడ్డి” చరిత్రలో నిలిచిపోతుంది. అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , ప్రశాంత్ వర్మ (Prasanth Varma) లాంటి సెలబ్రిటీలు సినిమా గురించి మాట్లాడిన విధానానికి సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి.
Prabhas
ముఖ్యంగా సినిమా విడుదలయ్యాక రివ్యూలు, చూసినవాళ్ళ టాక్ కూడా బాగా వచ్చాయి. అన్నిటికీ మించి రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా వేశారు. ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ కనీస స్థాయిలో కూడా లేకుండాపోయాయి. సిటీ మరియు మల్టీప్లెక్స్ లో మాత్రమే కాదు ఎక్కడా కనీసం చెప్పుకోదగ్గ టికెట్లు తెగలేదు. దాంతో ఇంకేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
అయితే.. సినిమాకి బజ్ లేకుండా విడుదల చేయడమే పెద్ద మైనస్ అయ్యిందని చెప్పాలి. టీజర్ & ట్రైలర్ జనాల్లోకి వెళ్లిందా? జనాల్లో సినిమాకి క్రేజ్ ఉందా? వంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా డేట్ & థియేటర్స్ దొరికాయి కదా అని రిలీజ్ చేసేశారు. అందువల్ల సినిమాని ఎవరు పట్టించుకోలేదు. పైపెచ్చు “ఫెయిల్యూర్ మీట్” అని కూడా నిర్వహించుకోవడం కొత్తగా ఉందనుకున్నారు కానీ..
సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి డిఫరెంట్ గా చేసుకొని ఉంటారులే అని జనాలు లైట్ తీసుకున్నారు. మొత్తానికి “లవ్ రెడ్డి” అనే సినిమా “ఒక కంటెంట్ ఉన్న సినిమా విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి?” అని విషయానికి ఉదాహరణగా నిలిచింది. మరి ఈ సినిమా పరిస్థితి చూసైనా కొత్త నిర్మాతలు తమ సినిమాల విషయంలో జాగ్రత్తపడతారేమో చూడాలి.