ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో… బి.సుధాకర్ మరియు కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆగస్ట్ 6 రాత్రి’. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.
అజయ్ రాహుల్, దుర్గాప్రియ, పవన్ వర్మ, సుప్రితా రాజ్, నాగమహేశ్, ధీరజ అప్పాజి, మునిచంద్ర, పద్మారెడ్డి, బక్తరపల్లి రవి, రాయదుర్గం రాజేశ్, మణి సాయి తేజ, ఆనంద్ మట్ట, శ్రీని రావ్, వినోద్ కుమార్ తదితరలు నటిస్తున్న ఆగస్ట్ 6 రాత్రి చిత్రం క్రైం థ్రిల్లర్ కథాంశంతో కూడిన లవ్ స్టోరీ కావడం గమనార్హం.
కర్నాటక లోని హొసకోట సమీపంలో భక్తరపల్లి పరిసరాల్లో మూడు రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. బెంగళూరు, నెల్లూరు, అనంతపురం, హైదరాబాద్ లలో కేవలం 6 రోజుల్లో ఆగస్ట్ 6 రాత్రి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రికార్డు సాధించాలి అని ధ్యేయంతో ఈ సినిమా చేస్తుండడం విశేషం.
దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ… “ఇప్పటికి 5 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్నాం. ఇక బ్యాలెన్స్ ఉన్న ఉదయభాను, సుమన్, నాగమహేశ్, మునిచంద్ర గారి సీన్లు ఒకరోజులో చేయనున్నాం” అన్నారు.