Avatar Movie: అవతార్ 5.. వామ్మో అన్నేళ్ళు ఎదురుచూడాలా?
- September 15, 2021 / 11:16 AM ISTByFilmy Focus
క్రియేటివ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ యొక్క అవతార్ ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 2009లో వచ్చిన ఆ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. పండోర అనే గ్రహంపై సుదూర భవిష్యత్తును తీసుకువెళ్లే విజువల్స్ తో అప్పట్లో సినిమా ఒక వండర్ ను చూపించింది. ఆ ప్రపంచంలోని మనుషుల జీవితాలన మైనింగ్ ఆపరేషన్ తో మానవులు అస్తవ్యస్తం చేశారు. ఇక ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే కథను జేమ్స్ కెమెరున్ మరింత పొడగించారు.
రాబోయే సినిమాలు కూడా అన్ని రకాల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతాయి అని చెప్పవచ్చు. చిత్ర నిర్మాత సంస్థ అప్పట్లో మరో నాలుగు అవతార్ చిత్రాలను రూపొందించడానికి సంతకం చేశారు. రెండవ విడత అవతార్ 2022 డిసెంబర్ 16న థియేటర్లలోకి రానుంది. అసలైతే మొదటి రెండు సీక్వెల్స్ ను 2014 తరువాత 2020 జూన్‌లో ప్రకటించారు. చివరికి ఆలస్యంతో ఇది దాదాపు ఎనిమిది సార్లు వాయిదా పడింది. ప్రస్తుత 2022 విడుదల తేదీకి వచ్చేశారు.
![]()
మూడవ విడత 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు, నాల్గవది 2026 డిసెంబర్‌లో, మరియు చివరి ఐదవ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదలవుతుందట అవతార్ 2లో రెగ్యులర్ తారాగణంతో పాటు, కేట్ విన్స్లెట్, విన్ డీజిల్ అలాగే ఇతరు కొత్త స్టార్స్ కూడా ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!















