Avatar2: ‘అవతార్ 2’ ట్రైలర్‌లో ఇవి గమనించారా!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీస్, ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న టైమ్ మరికొద్ది రోజుల్లో రాబోతోంది.. 2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సీక్వెల్.. ‘అవతార్ 2 – ది వే ఆఫ్ వాటర్’ కోసం దాదాపు 13 ఏళ్ళ పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. డిసెంబర్ 16న సుమారు 160 భాషలలో ‘అవతార్ 2’ కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్ కాబోతుంది.

ఇంతకుముందు ‘అవతార్ 2’ టీజర్‌‌తో శాంపిల్ చూపించిన డైరెక్టర్ ఇటీవలట్రైలర్‌తో మతిపోగొట్టేశారు. ఇప్పుడు ‘అవతార్ 2’ న్యూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రైలర్‌ని మించి.. దిమ్మతిరిగేలా ఉందీ కొత్త ట్రైలర్.. విజువల్స్ సింప్లీ సూపర్బ్.. జేమ్స్ కామెరూన్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. క్లుప్లంగా కథ చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది ట్రైలర్‌లో.. అసలు ఆయన ఊహకు దణ్ణం పెట్టెయ్యొచ్చు..మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యే జేమ్స్ కామెరూన్ స్టైల్ విజువలైజేషన్‌తో..

అవతార్ 2, ‘‘ది వే ఆఫ్ వాటర్’ అనే సూపర్బ్ థీమ్‌తో వస్తోంది.. ఫస్ట్ పార్ట్‌లో ప్రేక్షకులను పండోరా రాజ్యంలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఇప్పుడు అండర్ వాటర్‌లోనూ ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. సెకండ్ ట్రైలర్‌తో ఆడియన్స్‌ని మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లిపోయారు. సెకండ్ ట్రైలర్ కూడా అత్యద్భుతంగా ఉంది..పండోరా రాజ్యంలోని ప్రజలు అక్కడ జరిగిన విధ్వంసం వల్ల.. సముద్రంలోనే ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు.

అక్కడే వారి పవిత్ర వృక్షాన్ని ఏర్పరుచుకుని పూజించడం వంటివి కనిపిస్తాయి ఫస్ట్ ట్రైలర్‌లో… హీరో హీరోయిన్లు జేక్, నేయిత్రిల జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నట్లు చూపించారు. కథలో వాళ్ల క్యారెక్టర్లను కూడా ఎమోషనల్‌గా తీర్చిదిద్దారని అర్థమవుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. నీటిలో సినిమా తీసి.. అంచనాలను ఆకాశంలో పెట్టేశారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. డిసెంబర్ 16న త్రీడీలో కూడా ‘అవతార్ – ది వే ఆఫ్ వాటర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus