“కృష్ణార్జున యుద్ధం, దేవదాసు” లాంటి మోడరేట్ ఫ్లాప్స్ అనంతరం నాని కి దక్కిన బ్లాక్ బస్టర్ హిట్ “జెర్సీ”. ఈ సినిమా కమర్షియల్ హిట్ సాధించడం కంటే ఎక్కువగా జనాలకి నానిని మరింత చేరువ చేసింది. కమర్షియల్ గానూ రచ్చ చేస్తోంది. ఓవర్సీస్ లో ఇవాల్టికి 1 మిలియన్ క్లబ్ లో కూడా జాయిన్ అయిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటివారానికే 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం మొదటివారం పూర్తయ్యేలోపు 50 కోట్ల గ్రాస్ వసూలు చేయడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ట్రేడ్ పండితులు.
అంతా బాగానే ఉంది కానీ.. “జెర్సీ” సినిమాని ఓవర్సీస్ లో భారీ రేటుకి కొన్నారు. ఆ మొత్తం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి తిరిగి రావాలన్నా.. కనీస స్థాయి లాభాలు రావాలన్నా “జెర్సీ” కనీసం రెండు మిలియన్ డాలర్స్ వసూలు చేయాలి. సినిమాకి వచ్చిన రివ్యూలకి, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కి 2 మిలియన్ వసూలు చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ.. జెర్సీ లాంగ్ రన్ కి హాలీవుడ్ చిత్రం “అవెంజర్స్ ఎండ్ గేమ్” అడ్డుగా నిలవనుంది. భీభత్సమైన క్రేజ్ తో రిలీజావుతున్న ఈ సినిమాకి ఇండియాలోనే భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. అలాంటిది ఓవర్సీస్ లో ఉండే అటెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఈ శుక్రవారం విడుదవుతున్న ఈ హాలీవుడ్ సినిమా నాని ని 2 మిలియన్ మార్క్ కి చేరువవ్వకుండా అడ్డుకోవడం ఖాయమనే విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. మరి నాని ఆ అడ్డంకిని దాటుకొని వెళ్ళగలడా లేదా అనేది చూడాలి.