Avika Gor: ”అతడు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసేసుకుంటా”

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగు వారికి పరిచయమైంది నటి అవికా గోర్. తెలుగులో ఆమె ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడకి పోతావు చిన్నవాడ’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అవికా చివరిగా ‘రాజు గారి గది 3’ సినిమాలో కనిపించింది. ఆ తరువాత ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది.

రీసెంట్ గా హిందీలో ‘కాదిల్’ అనే ప్రయివేట్ సాంగ్ లో నటుడు ఆది ఆదిల్ ఖాన్ సరసన ఆడిపాడింది. ఈ క్రమంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న అవికా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా.. తన ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించింది. కొంతకాలంగా ఆమె మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ ఎన్జీవో కార్యక్రమంలో కలుసుకున్న వీరిద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు.

తన లవ్ స్టోరీ దక్షిణాది సినిమాల ప్రేమకథలా ఉంటుందని చెప్పుకొచ్చింది అవికా. ఇక పెళ్లెప్పుడని ప్రశ్నించగా.. ఇప్పుడు తనది పెళ్లి వయసు కాదని.. కానీ మిలింద్ చేసుకుందామని అడిగితే దానికి రెడీగా ఉన్నానని చెప్పింది. మిలింద్ కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నాడని.. ఏ క్షణాన్నైనా అడిగేలా ఉన్నాడంటూ చమత్కరించింది. అవికా మాటలను బట్టి ఆమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus