బిగ్‌బాస్‌ 4: జోకర్‌ను కంగారుపెట్టిన నాగార్జున!

‘జోకర్‌’గా ఇంట్లో అడుగుపెట్టిన అవినాష్‌… అప్పటినుండి నవ్విస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ‘నవ్వుల పులిహోర రాజా’ అని కూడా అనిపించుకుంటున్నాడు. అయితే ఆరియానా – అవినాష్‌ మధ్య ఇటీవల కాలంలో ఓ ట్రాక్‌ రన్ అవుతోంది. ఇంటి సభ్యులకు తెలియకుండా సైన్‌ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటున్నారు. సోఫాల మీద, చేతుల మీద వేలితో రాస్తూ అవినాష్‌… ఆరియానాకు ఏదేదో చెబుతున్నాడు. శనివారం నాగార్జున ఈ విషయాన్నే చర్చకు తీసుకొచ్చాడు.

రెండు రోజుల క్రితం ఆరియానా లివింగ్‌ రూమ్‌ ఊడుస్తుంటే… అవినాష్ వచ్చి ఏదో రాశాడు… ఆ విషయం మీరు చూసే ఉంటారు. అప్పుడు ఏం రాశావ్‌ అంటూ నాగార్జున ఈ రోజు అడిగాడు. ఆరియానా మరచిపోయాను అని చెప్పగా, అవినాష్‌ మాట దాటేస్తూ వచ్చాడు. నువ్వు ఆ మాట రాశాక ఆరియానా హగ్‌ కూడా ఇచ్చింది కదా అని కూడా గుర్తు చేశాడు. ఇక అసలు విషయం రప్పించడానికి నాగార్జునే చెప్పేశాడు. ‘ఐ లవ్‌ యూ’ అని రాశావ్‌ కదా అని అడిగాడు. దీంతో అవినాష్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. అయితే మళ్లీ నాగార్జునే ‘నువ్వు చాలా కూల్‌ అని రాశావ్‌’ కదా అని అన్నాడు. దీంతో అవినాష్‌ రిలీఫ్‌ అయ్యడు.

ఆ తర్వాత అసలు మజా మొదలైంది. ఈ రోజు ఉదయం కూడా నా చేతి మీద ‘చాలా బాగున్నావ్‌’ అని రాశాడు అని ఆరియానా చెప్పింది. దీంతో మళ్లీ అవినాష్ తల పట్టుకున్నాడు. ఈలోగా గంగవ్వ అందుకొని… ‘డ్రెస్‌ వెనుక గుండీలు కూడా పెట్టావ్‌’ కదా అంటూ గుర్తు చేసింది. దీంతో అవినాష్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఆఖరికి ‘ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు సర్‌…’ ఇక్కడేం జరగడం లేదు అంటూ అవినాష్‌ అనడంతో అందరూ నవ్వుకున్నారు. అయినా ఈ సైన్‌ లాంగ్వేజ్‌ ఎంత కంగారు పెట్టిందో కదా.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus