Avinash: పెళ్లికొడుకుగా మారిన జబర్ధస్థ్ అవినాష్..మేటర్ అదేనా!

కరోనా సెకండ్ వేవ్ ముగిసింది. లాక్ డౌన్ కూడా ఎత్తేసారు. జూలై రెండో వారం నుండీ ఆషాడం అంటున్నారు. కాబట్టి అది వచ్చే లోపు పెళ్లిళ్లు చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. మొన్నటికి మొన్న శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం జరిగింది.ఇప్పుడు ‘జబర్ధస్త్’ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం తాజాగా అవినాష్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోని పోస్ట్ చేసాడు.

ఈ ఫొటోలో అవినాష్ పెళ్లి కొడుకు డ్రెస్ లో కనిపిస్తుండడం విశేషం.దీంతో అవినాష్ కూడా పెళ్ళికి రెడీ అయిపోయాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతని ఫాలోవర్స్ కూడా కంగ్రాట్యులేషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘బిగ్ బాస్4’ లో పాల్గొన్న టైములో అవినాష్.. తనకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోతో అది నిజమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే కొంతమంది మాత్రం ఇది ‘ఏ కామెడీ షోలోనో వేసే స్కిట్ కోసం అవినాష్ ఇలా రెడీ అయ్యి ఉంటాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మొన్నటికి మొన్న జబర్దస్త్ వర్ష కూడా తాళిబొట్టు, ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టి.. పెళ్లి చేసుకుంటున్నట్టు షో చేసింది. కానీ చివరికి అది ఓ కామెడీ షో కోసం అని తెలిసి.. నెటిజన్లు విమర్శించారు. ఇప్పుడు వర్ష లానే అవినాష్ కూడా అలాంటి చీప్ ట్రిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus