కృష్ణ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన దేశం ఏదో తెలుసా!

  • November 15, 2022 / 01:25 PM IST

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15 ఉదయం కన్నుమూశారు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి, తెలుగు జాతికి వారి మరణం తీరని లోటు.. సినీ పరిశ్రమ ఓ పెద్దదిక్కుని కోల్పోయిందంటూ ప్రేక్షకలోకం షాక్‌కి గురైంది. తమ అభిమాన నటుడిని, మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు సన్నిహితులు.. ఇక కృష్ణ గారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది..ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్‌లో తల్లి ఇందిరా దేవి, నవంబర్‌లో నాన్నగారు పోవడం అనేది మహేష్ బాబుకి తీర్చలేని లోటు..

టాలీవుడ్ ఇండస్ట్రీకి కృష్ణ కొత్త టెక్నాలజీలను, కొత్త జానర్‌లను పరిచయం చేశారు సూపర్ స్టార్. తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎం.ఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సినిమాలు కృష్ణ నటించిన సినిమాలే కావడం, ఆయన పరిచయం చేసిన జానర్లే కావడం గమనార్హం. కొత్త నటులను, టాలెంట్ ఉన్న నటులను ప్రోత్సహించే విషయంలో కృష్ణ ముందువరసలో ఉండేవారు.

అప్పట్లో ఏ హీరోకు లేని విధంగా కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. సూపర్ స్టార్ ప్రేక్షకాభిమానుల ప్రశంసలు, రివార్డులతో పాటు వారందకున్న, వారిని వరించిన, అలంకరించిన అవార్డులు ఏంటో చూద్దాం..

కృష్ణ అందుకున్న అవార్డులు, పొందిన పురస్కారాలు..

తన కెరీర్‌లో ఎన్నో సాహసాలు, ప్రయోగాలు చేసిన సూపర్ స్టార్ ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్ ‘అల్లూరి సీతారామరాజు’ గానూ ఉత్తమ నటుడిగా 1974లో తొలిసారి నంది అవార్డునందుకున్నారు..

1976లో కేంద్ర ప్రభుత్వం కృష్ణను ‘నటశేఖర’ బిరుదుతో సత్కరించింది..

1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు..

2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2008లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వరించాయి.. అంతేకాదు, 2013లో ఆస్ట్రేలియా దేశం కృష్ణ పేరుతో పోస్టల్ స్టాంపు విడుదల చేసి మరీ గౌరవించడం విశేషం..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus