తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 300 థియేటర్లో రిలీజ్ కావడం సాధారణం. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లో రిలీజ్ అవుతుందంటే గొప్పగా చెప్పుకుంటాం. దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతూ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మూవీ దేశవ్యాప్తంగా 6500 తెరలపై ప్రదర్శించనున్నారు. ఈ మధ్య తెలుగు సినిమాలకు లాభాలను అందిస్తున్న అమెరికా లో 1100 తెరలపై బాహుబలి 2 సందడి చేయనుంది. ఇక ఇతర దేశాలన్నింటిలో కలిపి 1400 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు.
అంటే ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28 న బాహుబలి కంక్లూజన్ ని 8900 తెరలపై అభిమానులు వీక్షించనున్నారు. ఇది తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా, భారతీయ చలన చిత్ర చరిత్రలో రాయదగ్గ అరుదైన రికార్డ్. థియేటర్స్ పరంగానే కాకుండా షోస్ ప్రకారం కూడా రికార్డు సృష్టించనుంది. రోజుకి 6 ఆటలు ప్రదర్శించే విధంగా అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. దేశవ్యాప్తంగా ఇదే విధంగా షోస్ వేయనున్నారు. ఈ లెక్కన ఫస్ట్ డే కలక్షన్స్ పేరిట ఉన్న రికార్డులన్నింటినీ బాహుబలి బద్దలు కొట్టనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.