బాహుబలి అన్న పదం ఇప్పుడు రామనామంలా అయిపోయింది. ఎక్కడ విన్నా, ఇదే మాట, అయితే దాదాపుగా 5ఏళ్ల కష్ట ఫలితంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో ప్రదర్శింపబడుతుంది, ఇప్పటికే గత రాత్రి నుంచి వరుస షోస్ తో ఫేస్‌బుక్ వాల్స్ వాచింగ్ బాహుబలి-ద కంక్లూషన్ అన్న స్టేటస్ తో మార్మోగిపోతున్నాయి. అయితే అదే క్రమంలో టికెట్ రేట్స్ కూడా సామాన్య ప్రేక్షకుడికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి…విషయం ఏమిటంటే…టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ బాహుబలిని ఎక్కడ చూడాలి అని అనుకున్నా టికెట్ దర ఆకాశాన్ని అంటేలా ఉంది.. అయితే ఈ సినిమాకు..ఆంధ్రప్రదేశ్ అంతటా టికెట్ హైక్‌కి పర్మిషన్ దక్కింది. సినిమాపై పెట్టిన పెట్టుబడిని దృష్టిలో వుంచుకుని, బయ్యర్ల విజ్ఞప్తిని మన్నించి టికెట్ రేటుని పల్లె, పట్టణాలకి అనుగుణంగా వారం రోజుల పాటు వంద, రెండు వందల రూపాయలకి పెంచుకునే సౌలభ్యం కల్పించారు. అలాగే రోజుకి ఆరు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇక పక్క రాష్ట్రం, కర్నాటకలో కనీ వినీ ఎరుగని రేట్లకి టికెట్ల అమ్మకం జరుగుతోంది.
మే 1 నుంచి టికెట్ రేట్లపై హద్దు పెడతారనే వార్తల నేపథ్యంలో మొదటి వారాంతంలోనే క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి మాగ్జిమం పిండేయాలని చూస్తున్నారు. అంతెందుకు మన తమిళ తంబీలకు కూడా….చెన్నయ్‌లో కొన్ని థియేటర్లలో రెగ్యులర్ టికెట్ రేట్ అయిదు వందలు పెట్టారనే చెబుతున్నారు. ప్రతి చోటా బాహుబలిపై వున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి అందరూ హద్దు దాటుతోంటే, ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం ఆ అదృష్టం నిర్మాతలకు దక్కలేదు…ఇంతకీ ఎక్కడా అంటే….తెలంగాణాలో….అవును…తెలంగాణలో మాత్రం ‘బాహుబలి’కి టికెట్ హైక్ లేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాకపోవడం వల్ల హైదరాబాద్‌లో కూడా తొంభై తొమ్మిది శాతం థియేటర్లలో రెగ్యులర్ రేట్లకే బాహుబలి ప్రదర్శితమవుతుంది .తెలంగాణ జనాలకి మాత్రం కౌంటర్లో డెబ్బయ్ రూపాయలకే టికెట్ దొరుకుతుంది. ఇది ప్రేక్షకుడికి ఊరట కలిగించే విషయమే అయినా అసలు ట్విష్ట్ ఇక్కడే ఉంది, బ్లాక్ మార్కెట్ ఎక్కువై బల్క్‌క్ టికెట్స్ ఎక్కువ అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది, మొత్తం ఆయా రాష్ట్రాల్లో అదే బాహుబలి కధ…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.