Prabhas: ప్రభాస్ డ్యూయల్ రోల్.. ఫ్యాన్స్ కు పండగే..?

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ రాజమౌళి స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా సలార్ కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. బాహుబలి సిరీస్ సినిమాలలో ప్రభాస్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించినా ఈ పాత్రల కాంబినేషన్ లో సీన్లు లేవు.

అయితే సలార్ సినిమాలో ప్రభాస్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటిస్తారని ఈ రెండు పాత్రల మధ్య సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా కథతో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. ఇప్పటికే కొంతమేర ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి సలార్ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సలార్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. కొన్ని నెలల క్రితం సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అని కామెంట్లు వినిపించాయి. అయితే ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదని సలార్ సినిమాకు పని చేసిన నటులు చెబుతున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus