యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ మూవీ ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మోషన్ పోస్టర్స్ తో అంచనాలు పెంచిన జక్కన్న ట్రైలర్ ద్వారా సినిమాని రుచి చూపించబోతున్నారు. ట్రైలర్ విడుదల చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నా, కంప్యూటర్ గ్రాఫిక్(సీజీ) వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో డేట్ ప్రకటించడానికి ఆలోచిస్తున్నట్లు రాజమౌళి కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఆ పని ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
రెండు రోజుల క్రితం బాహుబలి సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ ‘అన్నపూర్ణ స్టూడియోలో బాహుబలి 2 ట్రైలర్ పని జరుగుతోంది. సన్నివేశాల అమరిక అంతా బాగుంది’ అంటూ సీవీ రావు, శివకుమార్లతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈరోజు చిత్ర బృందం ట్రైలర్ విడుదలపై ఓ నిర్ణయానికి వచ్చింది. వేదికను కూడా రాజమౌళి ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ మాదిరిగానే ముంబై వేదికగా మార్చి 15 న ట్రైలర్ రిలీజ్ చేయాలనీ ఫిక్స్ చేశారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.