ఒకే తరహా కథతో సినిమాలు రావడం అనేది సర్వసాధారణం. అయితే.. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 21) విడుదలవుతున్న రెండు తెలుగు సినిమాలు “బాపు (Baapu), రామం రాఘవం” సినిమాలు ఒకే తరహా మూలకథతో తెరకెక్కడం అనేది ఆసక్తి నెలకొల్పింది. బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్రలో దయా దర్శకత్వంలో తెరకెక్కిన “బాపు” డార్క్ హ్యూమర్ సినిమా. సముద్రఖని (Samuthirakani) టైటిల్ పాత్రలో ధనరాజ్ (Dhanraj) దర్శకుడిగా మారి తెరకెక్కించిన “రామం రాఘవం” (Ramam Raghavam) ఎమోషన్ డ్రామా. ఈ రెండు సినిమాల కథలు తండ్రి చావు చుట్టూ తిరగడం అనేది గమనార్హం.
తండ్రి చనిపోతే ఆయన ఉద్యోగం వస్తుంది అని భావించిన ఓ కొడుకు కథ “రామం రాఘవం”, తండ్రి చనిపోతే వచ్చే డబ్బుతో అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని ఎదురుచూసే కొడుకు కథ “బాపు”. ఒకరోజు విడుదలవుతున్న రెండు సినిమాల కథల విషయంలో ఈ స్థాయి సిమిలారిటీస్ ఉండడం అనేది చర్చనీయాంశం అయ్యింది. జోనర్ వేరు కాబట్టి ట్రీట్మెంట్ కూడా వేరేగా ఉంటుందనుకోండి. “బాపు” సినిమా విపరీతంగా నచ్చి ఎన్నడూ సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనని బ్రహ్మాజీ దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తుండగా..
“రామం రాఘవం” కూడా కంటెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదేవారం రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, జాబిలమ్మ నీకు అంత కోపమా” కూడా విడుదలవుతున్నాయి. మరి ఈ డబ్బింగ్ సినిమాలను అధిగమించి.. “బాపు & రామం రాఘవం” చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలుగుతాయా? ధనరాజ్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకోగలడా? అనేది చూడాలి.
ఎందుకంటే.. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న ధనరాజ్ నటుడిగా గ్యాప్ తీసుకొని మరీ “రామం రాఘవం” చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరి అతడి ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కుతుంది? వేణు తరహాలో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోగలుగుతాడా? అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.