విశ్వక్‌సేన్‌ X దేవీ నాగవల్లి విషయమై బాబు గోగినేని ఏమన్నారంటే?

  • May 4, 2022 / 04:11 PM IST

హీరో విశ్వక్‌సేన్‌ ఆ మాట అనకుండా ఉండాల్సింది. టీవీ9 దేవీ నాగవల్లిని అలా అనడం సరికాదు అని అంటున్నారు. గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లు చాలానే కనిపిస్తున్నాయి. అయితే దేవీ నాగవల్లి ఎదురుగా విశ్వక్‌సేన్‌ అలా ఎఫ్‌తో స్టార్ట్‌ అయ్యే నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని వాడటం సరికాదు. దీన్ని ఎవరూ సమర్థించరు కూడా. కానీ అసలు ఆ వివాదం స్టార్ట్‌ చేసింది ఎవరు అనే ఆలోచించాలి. అంతేకాదు అసలు విశ్వక్‌సేన్‌ అలా ఎందుకు రియాక్ట్‌ అయ్యాడు అనేది కూడా చూడాలి. దీని గురించి ప్రముఖ మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోనినేని సుదీర్ఘ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ పెట్టారు.

అసలు వివాదం నాడు ఏం జరిగింది, ఎవరు ఏం మాట్లాడారు, అసలు క్షమాపణ ఎవరు, ఎందుకు చెప్పాలి అంటూ వివరంగా రాసుకొచ్చారు. అందులోని ముఖ్యమైన పాయింట్లు మీ కోసం…

* విశ్వక్‌సేన్‌ నోరు జారడం, అనకూడదని పదం అంటున్న సందర్భంలోని వీడియో మాత్రమే వైరల్‌ అయ్యింది. అంతకుముందు దేవి అన్న మాటలు వైరల్‌ వీడియోలో లేవు. అయితే ఆమె ఏం అన్నది విశ్వక్‌ సేన్‌ రిపీట్‌ చేశారు. అప్పుడే అసలు మాటలు బయటికొచ్చాయి.

* ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ప్రచారం కోసం విశ్వక్‌సేన్‌ టీమ్‌ చేసిన ప్రాంక్‌ వీడియో గురించి, దాని వల్ల రేగిన వివాదం గురించి మాట్లాడుతూ విశ్వక్‌సేన్‌ను దేవి పాగల్‌సేన్‌ అని, డ్రిప్రెష్‌డ్‌ అంటూ సంభోదించారు. ఇది ఇండియన్‌ మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌ని ఉల్లంఘించనట్లే.

* దేవి అలా మాట్లాడుతుండటంతో విశ్వక్‌సేన్‌ ఆమెను వారించారు. మీరు మాటల్ని అదుపులో పెట్టుకోండని సూచించారు. తన డ్రిపెషన్‌ గురించి మాట్లాడే హక్కు లేదు అని కూడా పదే పదే గుర్తు చేశారు. దీనిపై విశ్వక్‌సేన్‌ పరువు నష్టం కేసు వేయొచ్చు.

* విశ్వక్‌సేన్‌ మాటలు నచ్చని దేవి నాగవల్లి.. ఆయనను తన స్టూడియో నుండి వెళ్లిపోండి అంటూ ‘గెట్‌ ఆవుట్‌ ఆఫ్‌ మై స్టూడియో’ అన్నారు. అయితే స్టూడియోకి రమ్మని విశ్వక్‌సేన్‌ను పిలిచింది టీవీ9 టీమే.

* ఎవరైనా మ్యాడ్‌ అన్నప్పడు రియాక్ట్‌ అవ్వడం ఆ వ్యక్తి హక్కు. దాని మీద నిరసన కూడా చెప్పొచ్చు. అక్కడ విశ్వక్‌సేన్‌ చేసింది అదే.

* ఈ మొత్తం వ్యవహారం జరిగాక టీవీ9 ఆ వీడియోను యూట్యూబ్‌ నుండి డిలీట్‌ చేసింది. ఇప్పుడు ఎవరూ చూసే అవకాశం లేదు.

* ఈ వ్యవహారం తర్వాత.. ఆమె వాళ్ల హెడ్‌ రజనీకాంత్‌ వద్దకు వెళ్లి.. విశ్వక్‌సేన్‌ భాష బాలేదు అని చెప్పారు. తన కుటుంబ సభ్యులు చూస్తున్నారు అని, ఆయన మాటలు సమంజసం కాదని కూడా చెప్పారు.

* అయితే అంతకుముందు విశ్వక్‌సేన్‌పై ఆమె ఎలాంటి మాటలు మాట్లాడారు అనేది ఆలోచించాఆలి. గెటవుట్‌ అని అనడం ఎంతవరకు సబబు. విశ్వక్‌సేన్‌ ఆ నాలుగక్షరాల మాట అనేముందే ఆమె గెటవుట్‌ అన్నారు.

* ఈ విషయంలో విశ్వక్‌సేన్‌ ఇటీవల క్షమాపణ కూడా కూడా చెప్పారు. కానీ అతని మానసిక అనారోగ్యం గురించి చర్చలో లేవనెత్తిన వ్యక్తి దేవీ నాగవల్లి. అక్కడ విశ్వక్‌సేన్‌ ఆబ్జెక్ట్‌ అయ్యారు.

* ఇక్కడ నాదొక ప్రశ్న. ‘డీజే టిట్లు’ సినిమా ప్రచారం సమయంలో… ‘మీరు ఉమనైజరా?’ అని దేవీ నాగవల్లి ప్రశ్నించారు. అప్పుడు డీసెన్సీ ఏమైంది. అప్పుడు కుటుంబసభ్యులు చూడలేదా?

* ‘డీజే టిల్లు’ విషయంలో ఆమె అడిగిన ప్రశ్నను ఒక మగ యాంకర్‌, లేడీ ఆర్టిస్ట్‌ని అడిగితే సబబుగా ఉంటుందా?

* ఒక వ్యక్తిని లేడీ యాంకర్‌ / జర్నలిస్ట్‌ ఇలా ‘మీకు పిచ్చి’ అనే అర్థం వచ్చేలా, డిప్రెషన్‌లో ఉన్నారా? అని అర్థం వచ్చేలా మాట్లాడితే ఏం చేయాలి.

* స్టూడియోలో విశ్వక్‌సేన్‌ విషయంలో దేవీ నాగవల్లి చేసిన పనికి.. ఆమెకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రవర్తించినందుకు విశ్వక్‌సేన్‌కు కూడా సారీ చెప్పాలి.

* ‘డీజే టిల్లు’ సినిమా ప్రచారంలో వుమనైజర్‌ ప్రశ్నను ఆమె తెలివిగా మాట్లాడినప్పటికీ.. ఆ ప్రశ్న చాలా తప్పు. దానికి కూడా దేవి నాగవల్లి క్షమాపణలు చెప్పాలి.

* అన్నింటికీ మించి దేవి నాగవల్లి చేసిన దాన్ని జర్నలిజం అని అనలేం అంటూ పోస్ట్‌ను ముగించారు బాబు గోగినేని.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus