Baby Movie: బేబీ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏం జరిగిందంటే?

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో బేబీ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద సినిమాలను మించి కలెక్షన్లను సాధించింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ఈటీవీ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మూవీగా బేబీ మూవీ రిలీజ్ కానుంది. బేబీ సినిమాలో ఆనంద్, విరాజ్ హీరోలు కాగా వైష్ణవి క్లైమాక్స్ లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.

ఆ నటుడు ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా జరిగింది. ఈ నటుడి పేరు మల్లిడి కృష్ణ కాగా బింబిసార సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న మల్లిడి వశిష్ట సోదరుడే ఈ నటుడు గమనార్హం. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ నటుడు బేబీ సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నారు. మల్లిడి కృష్ణకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా 11,000 మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.

మల్లిడి కృష్ణ టాలీవుడ్ లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. (Baby Movie) బేబీ సక్సెస్ తో మల్లిడి కృష్ణ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది. మల్లిడి వశిష్ట స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న నేపథ్యంలో ఆయన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలలో మల్లిడి కృష్ణకు ఛాన్స్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. చిరంజీవి 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. మెగాస్టార్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus