ఆ ఇద్దరు మెగా హీరోలు పండగలకు వచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపారు

ఇద్దరు మెగా హీరోలు రెండు పండగలకు వచ్చి బాక్సాపీస్ ని దున్నుకున్నారు. సాయి ధరమ్ తేజ్ 2019 చివర్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రతిరోజూ పండుగే చిత్రాన్ని విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ తో మంచి పోటీ మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధించింది. ధరమ్ తేజ్ గత చిత్రాలకు జరిగిన బిజినెస్ రీత్యా తక్కువ ధరలకే ప్రతిరోజూ పండగే చిత్రాన్ని విక్రయించడం జరిగింది. పర్ఫెక్ట్ టైములో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ రెట్టింపుకి మించిన వసూళ్లు సాధించింది. క్రిస్మస్ కి వచ్చిన ప్రతిరోజూ పండగే న్యూ ఇయర్ ని కూడా ఉపయోగించుకోవడంతో పాటు సంక్రాంతి చిత్రాలు విడుదలయ్యే వరకు జోరు కొనసాగించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ప్రతిరోజూ పండగే నిలిచింది.

ఇక సాయి ధరమ్ తేజ్ జోరు తగ్గిన వెంటనే మరో మెగా హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీతో దిగాడు. సంక్రాంతి సినిమాగా వచ్చిన ఈ చిత్రం తీవ్ర పోటీలో కూడా రికార్డు వసూళ్లు సాధించింది. ఇప్పటికే చాలా ఏరియాలలో నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం 150కోట్ల షేర్ వసూలు దిశగా వెళుతుంది. బన్నీ కెరీర్ బెస్ట్ మూవీగా అల వైకుంఠపురంలో నిలవడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురంలో యూఎస్ లో కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. మొత్తంగా బన్నీ ఈ సంక్రాంతి చిత్రంతో వసూళ్ల మోత మోగించాడు. ఇలా రెండు పండుగలకు వచ్చిన మెగా హీరోలు బాక్సాఫీస్ దుమ్ముదులిపారు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus