Pooja Hegde: స్టార్ హీరోయిన్ ను ఐరన్ లెగ్ అంటున్నారే..!

తమిళంలో ‘మాస్క్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది పూజాహెగ్డే. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’, హిందీలో ‘మొహంజదారో’ వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో ఫ్లాప్ లను ఎదుర్కొంది పూజాహెగ్డే. దీంతో ఆమెకి అవకాశాలు రావడం ఆలస్యమైంది. కానీ కొన్నాళ్లకు సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగి తన టాలెంట్ ను నిరూపించుకుంది. ‘డీజే’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ ఇలా వరుసగా హిట్స్ అందుకుంది.

దీంతో దర్శకనిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని ఇస్తూ.. హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు. పూజా ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకానికి వచ్చేశారు. అయితే కొత్త ఏడాదిలో ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ లాంటి పెద్ద సినిమాల్లో ఆమె నటించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగిపోతుందని అనుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు నిరాశ పరిచాయి.

‘రాధేశ్యామ్’ నిర్మాతలకు నష్టాలను తీసుకొచ్చింది. ‘బీస్ట్’ కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమాలో పూజా పాత్రకు అసలు స్కోప్ లేకపోవడంతో ఆమెని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నీలాంబరి అనే పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.

వరుసగా రెండుడిజాస్టర్ ల నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమా విడుదల కావడంతో సినిమాపై హోప్స్ పెట్టుకుంది పూజా. కానీ వర్కవుట్ అవ్వలేదు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ తరువాత నిలబడడం కష్టమేఅంటున్నారు . పూజా వల్ల ఈ సినిమాకు కానీ.. సినిమాల వల్ల పూజాకి కానీ ఒరిగిందేమీ లేదు. రెండు నెలల్లో మూడు ఫ్లాప్ లు అందుకోవడంతో ఇప్పుడు పూజాను ఐరన్ లెగ్ అని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతోంది. దీంతో అయినా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus