55 ఏళ్ళ వయసులో రవితేజ ఏంటేంటో ప్రయోగాలు చేస్తున్నాడు. రవితేజ ప్లస్ పాయింట్స్ కామెడీ, యాక్షన్ అని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీరియస్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ప్లాపులు వచ్చినా వెనకడుగు వేయడం లేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పుడు ‘రావణాసుర’.. ఈ రెండు సినిమాలు మరియు వాటి ఫలితాలు ఒక్కటే. ఇంకో కో- ఇన్సిడెన్స్ ఏంటి అంటే ఈ రెండు సినిమాలకు రవితేజ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాడు.
అంటే ఈ సినిమాల పై రవితేజ నమ్మకం ఎలాంటిదో ఇట్టే అర్ధమవుతుంది. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాల్ని మూటగట్టుకున్నాయి. అంతేకాదు నిర్మాణ రంగంలో రవితేజ రాణించలేకపోతున్నాడు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘రావణాసుర’ మాత్రమే కాదు.. విష్ణు విశాల్ నటించిన తమిళ సినిమాలు ‘ఎఫ్.ఐ.ఆర్’ ‘మట్టి కుస్తీ’ చిత్రాలను తన ‘ఆర్.టి.టీం వర్క్స్’ బ్యానర్ పై ప్రెజెంటర్ గా వ్యవహరించడం కూడా జరిగింది.
ఈ రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో తన బ్యానర్ పేరు మారిస్తే బెటర్ అని (Ravi Teja) రవితేజకి అతని సన్నిహితులు సలహా ఇచ్చారట. అయినా సరే రవితేజ ఇలాంటివి అస్సలు నమ్మడు, పట్టించుకోడు. ప్రస్తుతం రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!