కుష్బూ తమిళంలో స్టార్ హీరోయిన్. తెలుగులో కూడా 1986 లో కె.రాఘవేంద్రరావు -వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘భారతంలో అర్జునుడు’ ‘కిరాయి దాదా’ ‘మారణ హోమం’ ‘చిన్నోడు పెద్దోడు’ ‘శాంతి క్రాంతి’ ‘పేకాట పాపారావు’ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు. అయితే ఇందులో ‘పేకాట పాపారావు’ తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా ఆడలేదు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ‘స్టాలిన్’ ‘యమదొంగ’ పర్వాలేదు అనిపించినా.. అటు తర్వాత చేసిన ‘కథానాయకుడు’ ‘అజ్ఞాతవాసి’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కుష్బూ నటించిన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘రామబాణం’ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇందులో హీరోకి వదిన పాత్రలో కుష్బూ నటించింది.
రిలీజ్ కు ముందు ఈ సినిమాలో కుష్బూ (Kushboo) చాలా మంచి పాత్ర పోషించినట్లు అంతా చెప్పుకొచ్చారు. కానీ సినిమాలో ఈమె పాత్ర అంతంత మాత్రమే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ‘వారసుడు’ సినిమాలో కూడా ఈమె ఓ ముఖ్య పాత్ర పోషించింది. కానీ ఈమె రోల్ ను ఆ సినిమాలో లెంగ్త్ ఎక్కువవుతుంది అని తీసేశారట. కుష్బూ అయితే మంచి పెర్ఫార్మర్, 52 ఏళ్ళ వయసులో కూడా అందంగానే కనిపిస్తుంది. కానీ తెలుగు మేకర్స్ ఈమెకు మంచి పాత్రలు ఇవ్వడం లేదు.. అనే కంప్లైంట్ ఉంది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!