Ravi Teja: రెండో రోజే బాక్సులు వాపస్ వచ్చిన ఆ సినిమా ఏంటంటే..?

మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి స్వశక్తితో ఎదిగి.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు.. స్ట్రాంగ్ మార్కెట్ బిల్డ్ చేసుకున్నాడు.. అమితాబ్ బచ్చన్ అభిమాని రవి.. అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. తర్వాత చిన్న చిన్న వేషాలు వేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు.. ‘అల్లరి ప్రియుడు’, ‘సింధూరం’, ‘సీతారామ రాజు’, ‘మనసిచ్చి చూడు’, ‘నిన్నే పెళ్లాడతా’ ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించి.. ‘నీకోసం’ తో హీరోగా మారాడు..

తర్వాత ఖాళీగా లేకుండా, సోలో హీరోగానే చేయాలనే నియమాలేవీ పెట్టుకోకుండా ఇతర హీరోలతో కలిసి యాక్ట్ చేయడం.. క్యారెక్టర్స్ చేయడం చేస్తూ వచ్చాడు.. అప్పుడే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లో ఆఫర్ ఇవ్వడంతో రవితేజ కెరీర్ కీలక మలుపు తిరిగింది.. వెంటనే పెద్ద వంశీతో ‘ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’, పూరీతో సెకండ్ సినిమా ‘ఇడియట్’ తో హీరోగా ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టాడు.. దర్శక నిర్మాతలు తన డేట్స్ కోసం వెయిట్ చేసేంతలా క్రేజ్ అండ్ రేంజ్ పెరిగిపోయింది..

అప్పుడే సాలిడ్ దెబ్బ పడింది.. కొద్ది సంవత్సరాల క్రితం తను ఒప్పుకున్న ఓ సినిమా.. నానా సినిమా కష్టాలు పడి.. సరిగ్గా కెరీర్ మాంచి పికప్ టైంలో ఉన్నప్పుడు రిలీజ్ అయింది.. ఆ సినిమా పేరు ‘క్షుద్ర’.. సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకుడు.. షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతూ వచ్చిన ఈ చిత్రాన్ని.. రవితేజకు మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత.. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి రిలీజ్ చేసేశారు.. విడుదల సమయానికి టైటిల్ ‘అన్వేషణ’ గా మారిపోయింది..

పోస్టర్లు చూస్తుంటే ఎప్పటి సినిమానో అనే ఫీలింగ్ కలిగినా కానీ.. ఓసారి చూద్దాం అన్నట్టు డేర్ చేసి థియేటర్లకెళ్లిన ప్రేక్షకులు మామూలుగా షాక్ అవలేదు.. కట్ చేస్తే.. రెండో రోజే బాక్సులు వాపస్ వచ్చేశాయి.. తర్వాత ‘ఖడ్గం’ తో మరో సూపర్ హిట్ కొట్టాడు రవితేజ..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus