పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బద్రి’. ‘విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్’ బ్యానర్ పై టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2000 వ సంవత్సరం ఏప్రిల్ 20 న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.నేటితో ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది.పూరి జగన్నాథ్ కూడా డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఇదిలా ఉండగా.. ‘బద్రి’ సినిమా రిలీజ్ రోజు నాడు మొదటి షోతోనే ప్లాప్ టాక్ వచ్చిందట. అయితే రెండో రోజు నుండీ ఈ మూవీ గట్టిగా పుంజుకుంది. మాస్ కి సరికొత్త డెఫినిషన్ చెప్పిన మూవీ ఇది. ఫైనల్ గా ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈరోజు సోషల్ మీడియాలో ‘#23YrsOfBlockBusterBadri’ అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. మరి ఫుల్ రన్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
3.57 cr
సీడెడ్
2.41 cr
ఉత్తరాంధ్ర
1.35 cr
ఈస్ట్
1.05 cr
వెస్ట్
0.91 cr
గుంటూరు
1.21 cr
కృష్ణా
1.06 cr
నెల్లూరు
0.59 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
12.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.56 cr
వరల్డ్ వైడ్ టోటల్
12.65 cr
‘బద్రి’ (Badri) చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అయితే ఫుల్ రన్లో ‘బద్రి’ మూవీ రూ.12.65 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. బయ్యర్స్ కు రూ.3.4 కోట్ల లాభాలను అందించింది ‘బద్రి’ మూవీ.