Bagheera Review: ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కన్నడ సినిమాలకి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ‘కె.జి.ఎఫ్’ (KGF)  అనే సినిమా కన్నడ సినిమా రూపురేఖల్ని మార్చేసింది. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తర్వాత వచ్చిన ‘సలార్’ (Salaar)  కూడా పెద్ద హిట్ అయ్యింది.ఇది పక్కన పెడితే ప్రశాంత్ నీల్ బ్రాండ్ తో.. అంటే ఆయన కథతో రూపొందిన మరో యాక్షన్ మూవీ ‘బఘీర’ (Bagheera) . ‘ఉగ్రం’ ఫేమ్ శ్రీ మురళి హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీకి డాక్టర్ సూరి దర్శకుడు.

Bagheera Review:

‘హోంబలే ఫిలింస్’ సంస్థపై విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) ఈ చిత్రాన్ని నిర్మించారు.’సప్త సాగరాలు’ ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల కాబోతోంది. ‘ఏషియన్ సురేష్’ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఈ చిత్రాన్ని వీక్షించారట. ఒక సాధారణ యువకుడు రియల్ లైఫ్ లో సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు.

అతని టాలెంట్ తో సూపర్ హీరో అవ్వగలిగాడా? అతను అనుకున్నట్టు సొసైటీకి మంచి చేయగలిగాడా? అనే లైన్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్నాయట. అయితే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ వెనుక ఓ బలమైన ఎమోషన్ ఉందని అంటున్నారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుందట. ప్రకాష్ రాజ్ (Prakash Raj) , అచ్యుత్ కుమార్ (Achyuth Kumar), గరుడ రామ్ వంటి పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఇందులో ఉందట.

క్యారెక్టర్ ఆర్క్స్ కూడా బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. సినిమాలో ఎక్కువ శాతం నైట్ టైం షూట్ చేశారట. అందువల్ల డార్క్ థీమ్ ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగుందట. కచ్చితంగా ఒకసారి చూసే విధంగా ‘బఘీర’ ఉంటుందని.. యాక్షన్ ప్రియులకి నచ్చుతుందని అంటున్నారు. మరి రిలీజ్ రోజు మార్నింగ్ షోలు పడ్డాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

శివ కార్తికేయన్ ‘అమరన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus