బాహుబలి 2 ఆడియో వేడుక ఏర్పాటులో మునిగి ఉన్న జక్కన్న బృందం
- March 14, 2017 / 06:45 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పీడ్ పెంచారు. బాహుబలి కంక్లూజన్ మూవీ కంప్లీట్ కావడంతో ఇక దానికి ప్రజలవద్దకు తీసుకువెళ్ళడానికి ప్రచారాన్ని వేగవంతం చేశారు. వరుసగా పోస్టర్స్ విడుదల చేసి ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా ట్రైలర్ మార్చి 16 ఉదయం 9 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. ఈ ఏర్పాటులో జక్కన్న బిజీగా ఉండగా అతని భార్య రమా రాజమౌళి, కీరవాణి భార్య శ్రీవల్లి బాహుబలి 2 ఆడియో వేడుక పనులను మొదలు పెట్టారు.
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన మాహిష్మతి సెట్ లోనే బాహుబలి 2 పాటలను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈనెల 28 న ఈ ఫంక్షన్ నిర్వహించనున్నారు. తేదీ గురించి చిత్ర బృందం నిర్ణయం వెల్లడించనప్పటికీ పనులు మాత్రం మొదలు పెట్టింది. భారీ బడ్జెట్ సినిమాకి ఇదే ఆఖరి ప్రచార అస్త్రం కావడంతో ఈ వేడుకని వైభవంగా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















