బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈయన ట్రోఫీ గెలుచుకోవడంతో కొంతమంది అభిమానులు పలువురి సెలబ్రిటీ కార్లపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల పై కూడా దాడి చేయడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి ఆయనని జైలుకు పంపించారు. బిగ్ బాస్ కార్యక్రమం పోలీసులు ర్యాలీగా వెళ్లదని చెప్పినప్పటికీ ఈయన ర్యాలీ వెళ్లడంతో ఈయననే మొదటి ముద్దాయిగా గుర్తించి కేసు నమోదు చేశారు.
ఇలా పోలీసులు పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లి మరి తనని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు పంపించారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో గెలిచాము అన్న సంతోషం కూడా లేకుండా ఈయనని పోలీసులు అరెస్టు చేయడంతో తన తల్లిదండ్రులు ఎంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈయన అరెస్ట్ కావడంతో తన తల్లి అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయితే ఈయనకు బెల్ అప్లై చేయగా నాంపల్లి కోర్టు ఈయనకు బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తోంది.
కోర్టు పల్లవి ప్రశాంత్ కు బెయిల్ ఇవ్వడమే కాకుండా కొన్ని కండిషన్లు కూడా పెట్టారని, కండిషన్లతో కూడిన బెల్ మీద పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారని తెలుస్తుంది. ఇలా ఈయన విడుదల కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడంతో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఈయన అరెస్టును ఖండిస్తూ తనని విడుదల చేయాలి అంటూ కోరారు.
మొత్తానికి కండిషన్ల మీద ప్రశాంత్ బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల అత్యుత్సాహం కారణంగానే ఈయన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పాలి ఇప్పటికైనా అభిమానులు ఇలాంటి పిచ్చి పనులు మానేస్తేనే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.