Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు – జై బాలయ్య అంటూ నినాదాలు!

ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు – జై బాలయ్య అంటూ నినాదాలు!

  • September 2, 2024 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు – జై బాలయ్య అంటూ నినాదాలు!

నటుడిగా నందమూరి బాలకృష్ణ ప్రయాణానికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఆదివారం భారీ స్థాయి స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించింది. టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. బాలకృష్ణతో సినిమాలు చేసిన దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్‌, శ్రీకాంత్‌, రానా, నాని, గోపీచంద్‌, శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాఘవేంద్రరావు, బీ.గోపాల్, పరుచూరి బ్రదర్స్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, నిర్మాతలు డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సుమలత తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.

కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అతిథులు అంతా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

వేదికపై ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య’ పాటకు డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ఓ స్టెప్పు వేసి అతిథులను అలరించారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవితో కలిసి బాలకృష్ణ పలకరించడం ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన శైలిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్‌
చిరంజీవి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

బోయపాటి శ్రీను మాట్లాడుతూ “తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాలా కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్‌ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్‌, ఎటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారి కోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్‌ పెరుగుతుంది’’ అని అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ: బాలయ్య గారి గురించి మాట్లాడటం ఓ వరం. ఆయన గురించి డైలాగ్స్‌ రాయాలంటే బాలయ్య గారి నుంచి పుట్టేస్తాయి. బాడీ లాంగ్వేజ్‌ నుంచి వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయ నాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఆయనలా ఉండటం ఆయనకే సాధ్యం’’ అని అన్నారు.

వేదికపైకి వచ్చిన దిల్ రాజు, సాన బుచ్చి బాబు, గోపీచంద్‌ జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ “సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 సంవత్సరాలపాటు యావత్‌ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి వరదల కారణంగా రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య ేసవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

తమన్‌ మాట్లాడుతూ : అఖండ, వీర సింహారెడ్డి వంటి సినిమాలను నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. జై బాలయ్య’’ అని అన్నారు.

సుమలత: నేను బాలయ్యతో రెండు చిత్రాలు చేశా. నాకు తెలిసినంత వరకు చాల సింపుల్‌గా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

కమల్‌ హాసన్‌ (వీడియో) : సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకుని వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే, ఆయన తండ్రి ఎన్టీఆర్‌ గారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బావుండాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

మంచు విష్ణు : నేను ఈరోజు ఈస్థ్థాయిలో ఉన్నాను అంటే అది నాన్న గారు, బాలయ్య గారు వల్లే. బాలకృష్ణ గారు చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచమైనది. బాలయ్యా గారు వైద్య రంగంలో చేసినంత సేవ ఇంకెవరు చేయలేనిది’’ అని అన్నారు.
రానా దగ్గుబాటి : నేను బాలకృUఫ్ ష్ణ గారి సినిమా విడుదల రోజునకె పుట్ట అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా, జై బాలయ్య’ అన్నారు.

నాని మాట్లాడుతూ : బాలయ్యగారి సినీ జర్నీ నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ. ఆయన్ను ఒక్కసారి కలిసినా, దగ్గరగా చూసిన వెంటనే ఆయనను ఇష్టపడిపోతారు. మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి, 100 ఏళ్ల బ్రతకాలి’’ అని అన్నారు.

చిరంజీవి : బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. నేను బాలయ్య తో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నాను. బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి మీ ఇద్దరికీ నా చాలెంజ్. మా ఇద్దరితో కలిసి ఒక సినిమా చేయండి. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా అందరూ. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ” రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అదే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా వారు అంత చెప్పినట్లు నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. అలాగే నేను చేసే ప్రతి పనిలో అండగా ఉంటున్న నా భార్య వసుంధరకు ధన్యవాదాలు” అని అన్నారు.

పెమ్మసాని మాట్లాడుతూ ” రికార్డులు బద్దల కొడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య గారికి కృత్ఞతలు. మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీరే మా ఇన్స్పిరేషన్. కుటుంబంతో ప్రేమగా మెలగడంలో, వయసు పెరుగుతున్న కూడా తరానికి తగ్గట్లు మారడంలో మీరు మాకు ఒక ఆదర్శం”అని అన్నారు.

మంచు మోహన్ బాబు” భారత దేశంలో నలుమూలల నుండి వచ్చిన అందరికీ నమస్కారం. చిన్నతనం నుండి నటుడిగా విభిన్నమైన, విశిష్టమైన నటుడు బాలయ్య. 500 రోజులకు పైగా ఒక సినిమా ఆడటం అనే ఘనత బాలయ్యదే. 3 సార్లు హిందూపూర్ ఎంఎల్ఏగా ఎన్నికవడం చాల ఆనందకరం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అన్నారు.

శివ రాజ్ కుమార్ “మేము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఆయనకు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేము చెన్నైలో ఉన్నప్పటి కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాం”ని అన్నారు.

వెంకటేష్ : ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల నీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. ‘ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు అని డైలాగుతో వెంకటేష్ అలరించారు.

ఈ వేడుకలో భాగంగా విజయేంద్ర ప్రసాద్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, గోపీచంద్, హాస్యనటుడు బ్రహ్మానందం, శివ బాలాజీ, రాజా రవీంద్ర, రఘు బాబు అలాగే నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, ఏషియన్ సునీల్, చెరుకూరి సుధాకర్, మైత్రి మూవీస్ రవి, దిల్రాజు, కేఎల్ నారాయణ, సురేష్ బాబు, జెమిని కిరణ్, అదేవిధంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అయిన దామోదర్ ప్రసాద్ గారు, భరత్ భూషణ్ గారు, ఫిలిం ఫెడరేషన్ నుండి అనిల్ గారు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అనుపమ్ రెడ్డి గారు తదితరులు హాజరయ్యారు. బాలకృష్ణ గారు ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై బాలయ్య అనే నినాదాలు పలికారు. అలాగే నటులు నిరోషా, జీవిత రాజశేఖర్, మానశ్రీ తమిళ్ నుండి పి వాసు తదితర సినిమా ఇండస్ట్రీ పెద్దలు హారరావడంతో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Krishna
  • #Jai Balayya

Also Read

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

related news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

trending news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

16 hours ago
Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

17 hours ago
OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

17 hours ago
విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

18 hours ago
Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

20 hours ago

latest news

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

22 hours ago
Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

24 hours ago
Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

1 day ago
Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

1 day ago
Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version