కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘టిల్లు’ వేణు అలియాస్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి ‘బలగం’ అనే ఫీల్ గుడ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించి, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారిని ఆశ్చర్యపరిచాడు.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతవరణంలో సహజమైన పాత్రలతో.. మానవ సంబంధాలను మనసుల్ని కదిలించేలా చూపించి కంటతడి పెట్టించాడు.. ‘‘ఇది చిన్న సినిమా కాదు.. ప్రేక్షకులు మనసులు గెలిచిన సినిమా’’ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు..
వేణు లాంటి హాస్యనటుడు ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలు కలిగిన కథను ఇంతలా హ్యాండిల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదసలు..ఇటీవల సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్ సభ్యులను అభినందించారు.. తెలంగాణ సంసృతిని వంద శాతం చూపించిన నిజాయితీ గలిగిన సినిమా అని.. జబర్దస్త్‌లో తెలంగాణ ఒగ్గు కథలు, బుర్ర కథల వంటివి పెట్టి వేణు చేసిన స్కిట్ చూసినప్పుడే నిజంగా వేణులో ఇంత టాలెంట్ ఉందా అని తన మీద గౌరవం పెరిగిపోయిందంటూ చిరు చెప్పుకొచ్చారు..
ప్రస్తుతం ‘బలగం’ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.. సిరిసిల్లకు చెందిన వేణు ఆపదలో ఉన్న కళాకారులను ఆదుకుని మంచి మనసు చాటుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో కొమురవ్వ, మొగిలయ్య దంపతులు అందరి హృదయాలను కదిలించారు.. కనిపించేది కాసేపే అయినా ఆకట్టుకున్నారు.. ఇటీవల కళాకారుడు మొగిలయ్య కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకున్నారని తెలియడంతో వేణు స్పందించాడు.. వరంగల్ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్యల ఇంటికి వెళ్లి..
లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు.. చిత్ర నిర్మాత దిల్ రాజుతో మాట్లాడి మరింత సాయమందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు.. ఈ సందర్భగా వేణు కళాకారుల దంపతులను సన్మానించాడు.. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, గీత రచయిత కాసర్ల శ్యామ్, యాంకర్ గీత భగత్, దార్ల సందీప్, సామాజిక వేత్త కాయితి బాలు, నర్సంపేట సీఐ పులి రమేష్ తదితరులు పాల్గొన్నారు..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్