ఒక ప్రభుత్వ ఉద్యోగిగా దాదాపు 27 సంవత్సరాల పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎన్నో సేవలు అందించి అనంతరం రిటైర్డ్ అయినటువంటి నటుడు మురళీధర్ గౌడ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సినిమాలలోకి రాకముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఇలా 27 సంవత్సరాల పాటు పని చేసి రిటైర్డ్ అయిన తరువాత ఈయనకు సినిమాలు నాటకాలపై ఆసక్తి పెరిగింది. ఇలా నటన పట్ల ఆసక్తి పెరగడంతో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.
ఇలా సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో సీరియల్ అవకాశాలను అందుకుని పలు సీరియల్స్ లో నటించారు. అనంతరం ఈయనకు డీజే టిల్లు సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ప్రస్తుత సినిమాలలో ఫాదర్ క్యారెక్టర్లలో నటించే అవకాశాలను అందుకుంటు ఈయన కెరియర్ పరంగా బిజీ అయ్యారు. డిజే టిల్లు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన అనంతరం బలగం సినిమాలో కూడా నటించారు.
ఇలా బలగం సినిమా ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి మురళీధర్ గౌడ్ తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కూడా భాగమయ్యారు. ఈ సినిమాలో కూడా ఒక రాజకీయ నాయకుడి పాత్రలో ఈయన నటించారు. ఇక ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురళీధర్ గౌడ్ తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయిన తర్వాత సినిమాలపై ఆసక్తి పెరిగింది అయితే ఇలా సినిమాలలో తనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఎంతో సంతోషం వేస్తుంది అంటూ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే రిటైర్డ్ అయిన తరువాతనే మంచి సక్సెస్ అందుకుంటున్నాను అంటూ ఈయన (Muralidhar Goud) కాస్త ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.