‘దిల్‌రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి దర్శకుడు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ సినిమా మౌత్ టాక్ తో కంటే కూడా కాంట్రవర్సీతోనే ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పాలి.
ఈ కథ నాది అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత దర్శకుడు వేణు కూడా మీడియా ముందుకు వచ్చి అందులో నిజం లేదు అని చెప్పడంతో ‘బలగం’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రమోషన్ బాగా జరిగినట్లు అయ్యింది.ఈ క్రమంలో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారం ఇంకా బాగా కలెక్ట్ చేసింది. మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది.ఒకసారి ‘బలగం’ 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 5.21 cr |
సీడెడ్ | 0.43 cr |
ఆంధ్ర | 1.42 cr |
ఏపీ + తెలంగాణ | 7.06 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.18 cr |
‘బలగం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 17 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.7.18 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. నైజాంలో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.5.98 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి 5 రెట్ల వరకు లాభాలను అందించింది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?