‘దిల్‌రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’ (Balagam) . ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి దర్శకుడు.ఎటువంటి అంచనాలు లేకుండా మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను ఏర్పరుచుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్పుకొచ్చారు.
అయితే మౌత్ టాక్ బాగున్నంత మాత్రాన..చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. కానీ ‘బలగం’ మాత్రం 4వ వీకెండ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధించింది. పైగా ఈ చిత్రం ఓటీటీకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే. అయినా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తుంది. ఒకసారి 24 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
7.58 cr
సీడెడ్
0.78 cr
ఆంధ్ర
1.83 cr
ఏపీ + తెలంగాణ
10.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
10.37 cr
‘బలగం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 24 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.10.37 కోట్ల షేర్ ను సాధించింది. నైజాంలో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.9.17 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి 8 రెట్ల వరకు లాభాలను అందించింది.
ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా ఈ మూవీ ఇలా కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. పైగా మొదటి రోజు కంటే కూడా 24 వ రోజున ఈ మూవీ కలెక్షన్లు ఎక్కువగా నమోదయ్యాయి.