మార్చ్ 3 న విడుదలైన ‘బలగం’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నిర్మాత దిల్ రాజు కూడా ఊహించలేదని చెప్పిన సంగతి తెలిసిందే. వేణు ఎల్దిండి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటికీ చాలా థియేటర్లలో రన్ అవుతుంది.. అది కూడా ఓటీటీలో రిలీజ్ అయినా సరే.! ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు లభించింది.
ముఖ్యంగా నారాయణ పాత్రను పోషించిన మురళీధర్ ను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరనే చెప్పాలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసిన హాట్ టాపిక్ గా నిలిచారు. ఆయన మాట్లాడుతూ.. “మాది మెదక్ జిల్లాలో ఉన్న రామాయం పేట. మేము ఐదుగురం సంతానం. మా నాయన ఒక పెద్ద మనిషి దగ్గర జీతానికి పనిచేసేవాడు.
మాది (Muralidhar) చాలా పేద కుటుంబం .. పది రూపాయలు కూడా లేని రోజులు చూశాను. ఆ పది రూపాయలు అప్పు అడగడానికి అమ్మ పడిన నామోషీ చూశాను. చిరిగిన బట్టలు వేసుకుంటే అంతా గెలిచేసేవాళ్లను చూశాను. నేను పడిన అవమానాలు నేను జాగ్రత్తపడేలా చేశాయి. నేను డబ్బు విలువను .. సమయం విలువను తెలుసుకోవడానికి ఆ కష్ఠాలు సాయపడ్డాయి.
ఇప్పటికీ కూడా పది రూపాయలు ఖర్చు చేయడానికి నేను చాలా ఆలోచిస్తాను .. అవసరమైతేనే తప్ప ఖర్చు చేయడానికి ఇష్టపడను. అది పిసినారితనం కాదు .. ఎంత కష్టపడితే ఆ పది రూపాయలు వస్తాయనేది నాకు తెలుసు” అంటూ మురళీధర్ చెప్పుకొచ్చారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?