Balakrishna: ఆ లీక్స్ వల్ల బాలయ్య మూవీకి లాభమేనా?

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ కాగా మరికొన్ని రోజుల్లో టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం కర్నూలు, పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా అఖండ మూవీని మించిన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో బాలయ్య దిగిన కొన్ని ఫోటోలు, టైటిల్ సాంగ్ క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాల నుంచి ఫోటోలు లీకైతే సినిమాకు మైనస్ అవుతాయి. అయితే తాజాగా లీకైన ఫోటోలలో బాలకృష్ణ లుక్ ను చూసిన అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుకుంటున్నారు. బాలయ్య మాసిజానికి ఫిదా అవుతున్నామని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య లుక్ కొత్తగా ఉందని స్టార్ హీరో అయినప్పటికీ సింపుల్ గా ఉండటం బాలయ్య గొప్పదనానికి నిదర్శనమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే కొన్ని ఏరియాలకు సంబంధించి ఈ సినిమా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొననున్నారు.

బాలయ్య అనిల్ కాంబో మూవీకి `బ్రో! ఐ డోంట్ కేర్` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లు బాలయ్యతో సినిమాలను తెరకెక్కించి బాలయ్య కు కూడా సక్సెస్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!


రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus