Balakrishna: ఎన్టీఆర్‌ వజ్రోత్సవం.. బాలకృష్ణ పోస్ట్‌ వైరల్‌!

తెలుగులో ఓ సంచలనం పుట్టి 75 ఏళ్లు అవుతోంది. నవంబరు 24, 1949.. తెలుగు కళామ్మతల్లికి ముద్దు బిడ్డ దొరికిన రోజు అది. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (Sr NTR) . అవును ఎన్టీఆర్‌ సినిమాల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఆయన నటించిన తొలి సినిమా ‘మన దేశం’ నవంబరు 24, 1949న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ పోస్ట్‌ పెట్టారు.

Balakrishna

నేను అనునిత్యం స్మరించే పేరు.. నా గురువు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ వెండితెరపై ‘మన దేశం’ సినిమాతో దర్శనమిచ్చి నిన్నటితో 75 సంవత్సరాలు పూర్తి అయింది. వజ్రోత్సవం చేసుకుంటున్న ఇదే ఏడాదిలోనే తానూ హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాను. కళామ్మతల్లి సేవలో ‘స్వర్ణోత్సవం’ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని కూడా రాసుకొచ్చాడు బాలయ్య. నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న అభిమానులకు.. అలాగే ఈ సినీ ప్రయాణంలో నాకు సహకరించిన తోటి కళాకారులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, ఇతర విభాగాల వారికి కృతఙ్ఞతలు అని పోస్టులో బాలకృష్ణ రాసుకొచ్చారు.

ఇటీవల బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్‌ వజ్రోత్సవం గురించి చూస్తే.. ఎన్టీఆర్‌ తొలి సినిమా ‘మనదేశం’ను దిగ్గజ దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌ తెరకెక్కించారు. బెంగాలీ రచయిత శరత్‌ బాబు రాసిన ‘విప్రదాస్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో కనిపించారు. నాగయ్య, నారాయణ రావు, కృష్ణవేణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్‌ ప్రయాణం ఎలా సాగిందో మీ అందిరకీ తెలిసిందే. ఏడాదికి ఏడాది పదుల సంఖ్యలో సినిమలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అక్కడా అదరగొట్టారు. ఆయన పాలిటిక్స్‌ సినిమాలోని అభిమానమే పునాది అని చెప్పొచ్చు. అలాంటి స్పెషల్‌ డేనాడు.. స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు బాలయ్య.

ప్రముఖ నటుడు అలీకి అధికారుల నోటీసులు.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus