NBK 109: ‘ఎన్.బి.కె 109’ నిర్మాతలు జాగ్రత్త పడకపోతే కష్టం.!

Ad not loaded.

‘అఖండ’ (Akhanda)  ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) వంటి బ్లాక్ బస్టర్స్ తో ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  … తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఫేమ్ బాబీ కొల్లి (Bobby)  దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఏడాది దాటినా.. ఇంకా టైటిల్ కూడా రివీల్ చేయలేదు. ఒకటి, రెండు గ్లింప్స్..లు రిలీజ్ చేశారు. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో హైప్ అయితే జెనరేట్ కాలేదు.

NBK 109

2025 సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. కానీ ఆ హడావిడి ఇంకా ఏమీ మొదలుపెట్టలేదు. ఇదిలా ఉంటే.. రోజు రోజుకీ ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో ఆసక్తి సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తుంది. షూటింగ్ ఇంకా ఫినిష్ అవ్వకపోవడం ఒక కారణం అయితే.. ఈ మధ్యనే ‘అఖండ 2’ ప్రాజెక్టు కూడా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ‘అఖండ’ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

అందుకే ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో కూడా బాలయ్య 109 (NBK 109) మూవీ కంటే కూడా ‘అఖండ 2’ గురించే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇలా అయితే బాబీ సినిమా రిలీజ్ టైంకి బజ్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుంది. ముందు నుండి బజ్ కనుక ఉంటే.. టాక్ అటు ఇటుగా ఉన్నా సంక్రాంతి పండుగ మేనియాలో గట్టెక్కేస్తుంది.

లేదు అంటే ఓపెనింగ్స్ పై కూడా ప్రభావం పడుతుంది. పోటీగా రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా ఉంది కాబట్టి.. ‘ఎన్ బీ కె 109’ టీం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తే.. కొంచెం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి బజ్ ఏర్పడుతుంది.

ప్రభాస్ – హను.. క్రేజీ డీల్ సెట్టయినట్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus